News November 17, 2025
భవాని దీక్షల విరమణకు ప్రత్యేక ఏర్పాట్లు: ఈవో

భవాని దీక్షల విరమణ సందర్భంగా చేయాల్సిన ఏర్పాట్లపై సోమవారం ఉదయం ఇంద్రకీలాద్రిపై ఆలయ అధికారులు, సిబ్బందితో సమావేశం జరిగింది. ఆలయ ధర్మకర్తల మండలి ఛైర్మన్ బొర్రా రాధాకృష్ణ (గాంధీ), ఈవో వి.కె. శీనా నాయక్ ఈ సమావేశాన్ని నిర్వహించారు. డిసెంబర్ 4న జరిగే కలశ జ్యోతి ఊరేగింపు కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని, దీక్షా విరమణ సమయంలో భక్తులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకోవాలని ఈవో సిబ్బందిని ఆదేశించారు.
Similar News
News November 17, 2025
ఆటోడ్రైవర్ల సమస్యలపై కాంగ్రెస్‌కు చిత్తశుద్ధి లేదు: KTR

TG: ఆటోడ్రైవర్ల సమస్యల పరిష్కారం పట్ల కాంగ్రెస్ ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదని బీఆర్ఎస్ నేత కేటీఆర్ ఫైరయ్యారు. తాము అధికారంలో ఉన్న సమయంలో ఆటో డ్రైవర్లకు రూ.5 లక్షల ప్రమాద బీమా కల్పించినట్లు తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం వాటిని రెన్యూవల్ చేయకపోవడంతో బీమా సౌకర్యం కోల్పోయారని విచారం వ్యక్తం చేశారు. సిరిసిల్లలోని 5 వేల మంది ఆటోడ్రైవర్లకు ప్రమాద బీమా తానే కడతానని పేర్కొన్నారు.

హనుమకొండలో వ్యభిచార ముఠా ARREST

వరంగల్ టాస్క్‌ఫోర్స్ అధికారులకు అందిన సమాచారంతో ఈరోజు హనుమకొండలోని గోపాల్‌పూర్‌లో ఓ ఇంటిపై దాడి చేసి వ్యభిచార నిర్వాహకురాలితోపాటు ముగ్గురు యువకులను అరెస్ట్ చేశామని పోలీసులు తెలిపారు. వారి నుంచి రూ.4,270 నగదు,7 సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నామన్నారు. నిందితులను కేయూసీ PSకు తరలించామని చెప్పారు. దాడిలో టాస్క్‌ఫోర్స్ ఏసీపీ మధుసూదన్, ఇన్‌స్పెక్టర్ బాబులాల్, హెడ్ కానిస్టేబుల్ స్వర్ణలతారెడ్డి ఉన్నారు.