News April 13, 2024
నేటి నుంచి ఎన్నికల సన్నాహక సమావేశాలు

నల్లగొండ పార్లమెంట్ పరిధిలోని అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో నిర్వహించే ఎన్నికల సన్నాహక సమావేశాలకు అవసరమైన అన్ని ఏర్పాట్లను కాంగ్రెస్ పార్టీ పూర్తి చేసింది. షెడ్యూల్ ప్రకారం రోజూ సాయంత్రం 4 గంటలకు ఈ సమావేశాలను నిర్వహించబోతుంది. 13వ తేదీన దేవరకొండ, 16న మిర్యాలగూడ, 18న కోదాడ, 19న హుజూర్ నగర్, 20న సూర్యాపేట, 21న నల్లగొండ, 22న నాగార్జునసాగర్ నియోజక వర్గాల్లో సమావేశాలు నిర్వహించనుంది.
Similar News
News March 3, 2026
NLG: ‘పాలనలో వేగం పెంచాలి’.. కలెక్టర్ల సదస్సులో CM

రాష్ట్ర సచివాలయంలో మంగళవారం CM రేవంత్ రెడ్డి అధ్యక్షతన జిల్లా కలెక్టర్ల సదస్సు అత్యంత కీలకంగా సాగింది. ప్రభుత్వ ప్రాధాన్యతలు, సంక్షేమ పథకాల అమలు తీరుపై ముఖ్యమంత్రి సుదీర్ఘంగా సమీక్షించారు. ఈ సమావేశంలో నల్గొండ జిల్లా కలెక్టర్ బీ.చంద్రశేఖర్ పాల్గొని జిల్లాలో సాగుతున్న అభివృద్ధి పనుల పురోగతిని వివరించారు. ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా యంత్రాంగం పనిచేయాలని CM ఆయా జిల్లాల కలెక్టర్లకు సూచించారు.
News March 3, 2026
దేవరకొండ హోలీ సంబరాల్లో విషాదం.. విద్యార్థి మృతి (Update)

దేవరకొండ ఉప్పవాగు వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో కార్తికేయన్ మృతి చెందాడు. స్నేహితులతో కలిసి హోలీ ఆడేందుకు బైక్‌పై వెళ్తుండగా ప్రమాదవశాత్తు డివైడర్‌ను ఢీకొన్నారు. విద్యార్థి తలకు బలమైన గాయం కావడంతో తీవ్ర రక్తస్రావం జరిగింది. పరిస్థితి విషమించడంతో మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్‌కు తరలించగా అక్కడ చనిపోయాడు. మరో విద్యార్థి శ్రీనివాసచారి పరిస్థితి విషమంగా ఉంది.
News March 3, 2026
NLG: రైతులకు గుడ్ న్యూస్.. ఉగాది తర్వాతే..!

జిల్లాలో యాసంగి (రబీ) సీజన్ ధాన్యం కొనుగోలు ప్రక్రియకు యంత్రాంగం సిద్ధమవుతోంది. తెలుగు నూతన సంవత్సరం ఉగాది పండుగ ముగిసిన వెంటనే కొనుగోలు కేంద్రాలను ప్రారంభించేందుకు అధికారులు కసరత్తు వేగవంతం చేశారు. ధాన్యం సేకరణపై జిల్లా రెవెన్యూ అదనపు కలెక్టర్ సంబంధిత శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించి కీలక ఆదేశాలు జారీ చేశారు. ఈ యాసంగిలో జిల్లా వ్యాప్తంగా సుమారు 4.91 లక్షల ఎకరాల్లో రైతులు వరి సాగు చేశారు.


