News November 19, 2025

ప్రజల అవసరాలకు అనుగుణంగా పనిచేయాలి: KMR SP

image

కామారెడ్డి ఎస్పీ రాజేష్ చంద్ర దేవునిపల్లి పోలీస్ స్టేషన్‌ను మంగళవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. రికార్డులు, రిసెప్షన్, లాక్-అప్ రూమ్ సహా అన్ని విభాగాలను పరిశీలించారు. సైబర్ క్రైమ్, ఆన్‌లైన్ మోసాలు, మూఢనమ్మకాలు వంటి అంశాలపై గ్రామాల్లో అవగాహన పెంచాలని సూచించారు. ప్రజా ఫిర్యాదుల్లో ఎలాంటి జాప్యం చేయకుండా తక్షణమే స్పందించాలని ఎస్పీ సూచించారు. ASP చైతన్య రెడ్డి, CI రామన్, SHO రంజిత్ పాల్గొన్నారు.

Similar News

News March 21, 2026

జగిత్యాల: జీవన్ రెడ్డి 25న కీలక భేటీ… నిర్ణయం ఖాయం?

image

మాజీ మంత్రి జీవన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసే దిశగా అడుగులు వేస్తున్నట్లు సమాచారం. ఈనెల 25న తన అనుచరులతో కలిసి రాజీనామా చేసే అవకాశముంది. జగిత్యాలలోని ఓ గార్డెన్‌లో మూడు నియోజకవర్గాల నాయకులు, కార్యకర్తలతో సమావేశం నిర్వహించనున్నారు. ఈ సమావేశం అనంతరం సమూహంగా పార్టీతో పాటు పదవులకు రాజీనామా చేసే అవకాశముందని తెలుస్తోంది. భవిష్యత్ కార్యాచరణపై కూడా అదే రోజు స్పష్టత ఇవ్వనున్నట్లు సమాచారం.

News March 21, 2026

BREAKING: భారీగా తగ్గిన బంగారం, వెండి ధరలు

image

హైదరాబాద్ బులియన్ మార్కెట్లో ఇవాళ బంగారం, వెండి ధరలు భారీగా తగ్గాయి. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.2,940 తగ్గి రూ.1,45,970, 22 క్యారెట్ల గోల్డ్ రూ.2,750 తగ్గి రూ.1,33,800 పలుకుతోంది. అటు వెండి కిలోపై ఏకంగా రూ.10,000 తగ్గి రూ.2,50,000కి చేరింది.

News March 21, 2026

గద్వాలలో మరో విషాదం నింపిన యాక్సిడెంట్ ఘటన!

image

గద్వాల జిల్లా అయిజ నరసింహ కాలనీకి చెందిన మిట్టదొడ్డి నాగరాజు కుమారుడు విష్ణు చైతన్య(18) శనివారం మృతిచెందినట్లు కాలనీవాసులు తెలిపారు. ఈనెల17న గద్వాల రైల్వే స్టేషన్ సమీపంలో జరిగిన <<19408308>>రోడ్డు ప్రమాదంలో<<>> విష్ణు చైతన్య తీవ్రంగా గాయపడ్డాడు. మొదట కర్నూలుకు, ఆ తర్వాత మెరుగైన చికిత్స నిమిత్తం HYDఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతిచెందాడు. కాగా ఈ ఘటనలో ఇప్పటికే అతడి ఫ్రెండ్ రాము మృతిచెందిన విషయం తెలిసిందే.