News November 19, 2025

ప్రజల అవసరాలకు అనుగుణంగా పనిచేయాలి: KMR SP

image

కామారెడ్డి ఎస్పీ రాజేష్ చంద్ర దేవునిపల్లి పోలీస్ స్టేషన్‌ను మంగళవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. రికార్డులు, రిసెప్షన్, లాక్-అప్ రూమ్ సహా అన్ని విభాగాలను పరిశీలించారు. సైబర్ క్రైమ్, ఆన్‌లైన్ మోసాలు, మూఢనమ్మకాలు వంటి అంశాలపై గ్రామాల్లో అవగాహన పెంచాలని సూచించారు. ప్రజా ఫిర్యాదుల్లో ఎలాంటి జాప్యం చేయకుండా తక్షణమే స్పందించాలని ఎస్పీ సూచించారు. ASP చైతన్య రెడ్డి, CI రామన్, SHO రంజిత్ పాల్గొన్నారు.

Similar News

News March 5, 2026

TODAY HEADLINES

image

* ఇరాన్ యుద్ధ నౌకపై US దాడి.. 100 మంది మృతి
* AP, TG.. రేపు టెన్త్ హాల్ టికెట్లు విడుదల
* AP: 30,588 GOVT ఉద్యోగాలు ఇచ్చాం: CBN
* AP: దివ్యాంగులకు ఫ్రీ జర్నీ.. 18న ప్రారంభం
* AP: నెయ్యి సరఫరాలో CBN స్కామ్‌లు: జగన్
* TG: RS అభ్యర్థులుగా సింఘ్వీ, నరేందర్ రెడ్డి
* TG: టీచర్ల జీతాలను ప్రభుత్వం తగ్గించదు: KK
* TG: త్వరలో ఢిల్లీకి KCR.. రాజకీయ మిత్రులతో భేటీ?
* సెమీస్‌లో SAపై NZ విజయం.. ఫైనల్‌కు చేరిక

News March 5, 2026

ఏం కొట్టావయ్యా అలెన్..

image

T20WC సెమీస్‌లో SAపై న్యూజిలాండ్ ఓపెనర్ <<19299856>>ఫిన్ అలెన్<<>> విధ్వంసం సృష్టించారు. 33 బంతుల్లోనే శతకం బాదారు. ఇందులో 10 ఫోర్లు, 8 సిక్సర్లు ఉన్నాయి. T20WCలో, ఫుల్ మెంబర్ టీమ్‌పై ఇదే ఫాస్టెస్ట్ సెంచరీ. 2016లో ఇంగ్లండ్‌పై గేల్(WI) 47 బంతుల్లో మూడంకెల స్కోర్ బాదారు. ఓవరాల్‌గా T20Iలలో మూడో వేగవంతమైన శతకం. 2024లో సాహిల్(ఎస్టోనియా)vsసైప్రస్‌పై 27 బంతుల్లో, ఫహాద్(తుర్కియే)vsబల్గేరియాపై 29 బాల్స్‌లో సెంచరీ చేశారు.

News March 5, 2026

GALLERY: ‘విరోష్’ రిసెప్షన్.. తళుక్కుమన్న తారలు

image

విజయ్ దేవరకొండ-రష్మిక రిసెప్షన్‌లో సినీ తారలు సందడి చేశారు. నానీ, వెంకటేశ్, నాగార్జున, నాగచైతన్య, అల్లుఅర్జున్, కార్తీ, నవీన్ పోలిశెట్టి, ప్రియదర్శి, సత్యదేవ్ తదితరులు నూతన వధూవరులకు గ్రీటింగ్స్ చెప్పారు. ఇక రాజకీయ ప్రముఖుల్లో బీఆర్ఎస్ నేత కేటీఆర్, కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ విరోష్ జంటకు శుభాకాంక్షలు చెప్పి ఆశీర్వదించారు.