News November 19, 2025

ఈ హెయిర్ ‌స్టైల్స్‌తో హెయిర్‌ఫాల్

image

కొన్నిరకాల హెయిర్‌స్టైల్స్‌తో కుదుళ్లకు రక్తప్రసరణ తగ్గి హెయిర్‌ఫాల్ అవుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. పోనీటెయిల్స్, కార్న్‌రోస్, బన్స్, హెయిర్ ఎక్స్‌టెన్షన్స్ అలోపేషియాకు కారణమవుతాయని అమెరికన్ అకాడమీ ఆఫ్ డెర్మటాలజీ అసోసియేషన్ పేర్కొంది. గట్టిగా బిగిస్తే కుదుళ్లు బలహీనమై జుట్టు ఊడిపోతుందని చెబుతున్నారు. కాబట్టి జుట్టుకు హాని కలిగించని హెయిర్​స్టైల్స్​ ప్రయత్నించాలని సూచించారు.

Similar News

News March 7, 2026

MEC తర్వాత ఏయే కోర్సులు చేయొచ్చంటే?

image

<<19311173>>ఇంటర్‌లో<<>> MEC పూర్తి చేసిన విద్యార్థులకు ఒకప్పుడు ప్రధాన లక్ష్యం ‘CA’ మాత్రమే. కానీ ఇప్పుడు పరిస్థితులు మారాయి. మ్యాథ్స్‌పై పట్టు ఉండి సాఫ్ట్‌వేర్ రంగం వైపు వెళ్లాలనుకున్నవారు BCA లేదా Data Analytics కోర్సులను ఎంచుకోవచ్చు. మేనేజ్‌మెంట్ రంగంపై ఆసక్తి ఉన్నవారు BBA ద్వారా కార్పొరేట్ కంపెనీల్లో స్థిరపడవచ్చు. డిగ్రీలో BA, B.Com, BScలో చేరవచ్చు. LAW, హోటల్ మేనేజ్మెంట్ కూడా చేయొచ్చు. రేపు CEC గురించి..

News March 7, 2026

మీ మద్య నిషేధం హామీ వెనుక అసలు కథ ఇదేనా: లోకేశ్

image

AP: గత ప్రభుత్వ హయాంలో అక్రమ మద్యం రాష్ట్రంలో వేల కుటుంబాలను నాశనం చేసిందని మంత్రి లోకేశ్ ఆరోపించారు. ‘ప్రతి నెలా ₹100 కోట్ల కిక్‌బ్యాక్‌లు, ₹3,500 కోట్ల అక్రమ లావాదేవీలు జరిగాయని ED బయటపెట్టింది. మద్య నిషేధం అమలు చేస్తామన్న హామీ వెనుక అసలు కథ ఇదేనా జగన్? మీ అనుచరుల జేబుల్లో వేల కోట్లు చేరాయని ఆరోపణలు వచ్చాయి. వీటిపై ప్రజలకు సమాధానం చెప్పగలరా? నిశ్శబ్దమే మీ సమాధానమా?’ అని ట్వీట్ చేశారు.

News March 7, 2026

హెయిర్ కట్ సరిగా చేయలేదని ₹25లక్షల ఫైన్

image

హెయిర్ కట్‌లో పొరపాటు భారీ మూల్యం చెల్లించేలా చేసింది. 2018లో ఓ మోడల్ హెయిర్ కట్ కోసం ముంబై ITC హోటల్ సెలూన్‌కు వెళ్లింది. స్టైలిస్ట్ చేసిన వర్క్ ఆమెకు నచ్చలేదు. దీంతో తాను మానసికంగా కుంగి మోడలింగ్, ఇంటర్వ్యూ అవకాశాలు కోల్పోయానని కన్జూమర్ ఫోరంలో కంప్లయింట్ చేసింది. కమిషన్ 2021లో ₹2కోట్ల పరిహారం ప్రకటించగా, ITC సుప్రీంకు వెళ్లింది. దీంతో తీర్పు రివైజ్ చేస్తూ ₹25 లక్షలు ఇవ్వాలని SC ఆదేశించింది.