News April 13, 2024
ఆన్‌లైన్‌లో అయోధ్య రాముడి థీమ్ నాణేలు

అయోధ్య రాముడి థీమ్‌తో కేంద్ర ప్రభుత్వం రూపొందించిన నాణేల అమ్మకాలు ప్రారంభమయ్యాయి. అయోధ్యలోని రామ్ లల్లా, రామ జన్మభూమి దేవాలయం థీమ్‌తో కూడిన 3 సావనీర్ నాణేలను గత ఫిబ్రవరిలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ విడుదల చేసిన విషయం తెలిసిందే. తాజాగా వాటిని ప్రజలకు అందుబాటులో ఉంచారు. ఎస్పీఎంసీఐఎల్ వెబ్‌సైట్‌లో కొనుగోలు చేయొచ్చు.
Similar News
News March 3, 2026
కల్తీ పాలు, బాణసంచా పేలుడు.. పెరిగిన మృతుల సంఖ్య

AP: రాష్ట్రంలో తీవ్ర విషాదం నింపిన కాకినాడ(D) వేట్లపాలెం బాణసంచా పేలుడు <<19266434>>ఘటనలో<<>> మృతుల సంఖ్య 23కి చేరింది. GGHలో చికిత్స పొందుతూ లోవరాజు(38) అనే వ్యక్తి మృతి చెందారు. అటు రాజమండ్రి కల్తీ పాల ఘటనలో మృతుల సంఖ్య 7కి చేరింది. చౌడేశ్వర్ నగర్‌కు చెందిన సూర్యారావు(81) ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ చనిపోయారు. మరో 13 మంది బాధితులు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.
News March 3, 2026
జగన్‌ను కలిసిన భట్టి

AP: తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తాడేపల్లిలో మాజీ సీఎం జగన్‌ను కలిశారు. తన కుమారుడి వివాహ ఆహ్వానపత్రికను అందజేసి, వేడుకకు రావాలని కోరారు. జగన్ ఆయనకు శుభాకాంక్షలు తెలియజేసి, వధూవరులు నిండైన దాంపత్య జీవితం గడపాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా ఇద్దరు నేతలు ఆత్మీయంగా హత్తుకొని యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. కాగా భట్టి దివంగత వైఎస్సార్‌ను ఎంతగానో అభిమానిస్తారు.
News March 3, 2026
APPLY NOW: SPMCILలో ఉద్యోగాలు

సెక్యూరిటీ ప్రింటింగ్ అండ్ మింటింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (SPMCIL) 3 సైబర్ సెక్యూరిటీ ఎక్స్‌పర్ట్ పోస్టులను భర్తీ చేయనుంది. అర్హతగల వారు మార్చి 6 వరకు అప్లై చేసుకోవచ్చు. పోస్టును బట్టి BE/BTech ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి. అభ్యర్థుల గరిష్ఠ వయసు 35 ఏళ్లు. నెలకు రూ.50వేలు చెల్లిస్తారు. ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. వెబ్‌సైట్: https://www.spmcil.com


