News November 17, 2025

కర్నూలు: కేంద్ర మంత్రి మనోహర్ లాల్‌కు ఘన స్వాగతం

image

కర్నూలు జిల్లా పర్యటన నిమిత్తం కేంద్ర విద్యుత్, గృహ, పట్టణ వ్యవహారాల శాఖ మంత్రి మనోహర్ లాల్ సోమవారం విచ్చేశారు. ఓర్వకల్ విమానాశ్రయంలో కేంద్ర మంత్రికి కర్నూలు ఎంపీ బస్తిపాటి నాగరాజు, జిల్లా కలెక్టర్ డా. ఏ. సిరి, జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ ఘన స్వాగతం పలికారు. అనంతరం కేంద్రమంత్రి గెస్ట్ హౌస్‌కు చేరుకొని జిల్లా అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు.

Similar News

News November 17, 2025

సమస్యల పరిష్కరానికి చర్యలు తీసుకోవాలి: భూపాలపల్లి కలెక్టర్

image

ప్రజావాణి కార్యక్రమంలో వచ్చిన దరఖాస్తుల పరిష్కారానికి అధికారులు చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ తెలిపారు. సోమవారం భూపాలపల్లిలోని ఐడీఓసీలో ప్రజల నుంచి ఆయన 37 దరఖాస్తులు స్వీకరించి, పరిష్కరానికి చర్యలు తీసుకోవాలని సబంధిత అధికారులకు ఎండార్స్‌మెంట్ చేశారు. తదుపరి ప్రజావాణి వరకు జీరో పెండింగ్ ఉండేలా చర్యలు తీసుకోవాలని ఆయన స్పష్టం చేశారు.

కొమురవెళ్లి మల్లన్న భక్తులకు గుడ్ న్యూస్

image

సిద్దిపేట జిల్లాలోని కొమురవెల్లి మల్లికార్జున స్వామి కళ్యాణం, జాతర తేదీలను దేవాదాయశాఖ మంత్రి కొండా సురేఖ ప్రకటించారు. మల్లన కల్యాణోత్సవం డిసెంబర్ 14న ఉదయం 10.45 నిముషాలకు జరగనుంది. అలాగే స్వామి వారి జాతర 2026 జనవరి 14 నుంచి 18 వరకు జరగనుందని ప్రకటించారు. స్వామివారి కల్యాణోత్సవానికి ప్రభుత్వం తరపున పట్టు వస్త్రాలు, తలంబ్రాలు సమర్పించనున్నారు.