News November 17, 2025
చాంద్రాయణగుట్ట పేరు ఎలా వచ్చిందో తెలుసా?

చాళుక్యుల కాలంలో పాతబస్తీలోని ఎత్తైన కొండపై స్వయంభు లక్ష్మీ చెన్నకేశవస్వామి దేవస్థానం ఉండేదని ఇక్కడివారు చెబుతారు. ఆ కాలంలో ఈ కొండను చిన్నరాయి గుట్టగా పిలిచేవారట. తర్వాత కాలక్రమంలో చిన్నరాయిగుట్ట అనే పిలుస్తూనే.. చాంద్రాయణగుట్టగా మారిపోయింది. ఈ పవిత్ర గుట్టను ఇంకా కొంతమంది కేశవగిరి అని కూడా పిలుస్తారు.
Similar News
News November 17, 2025
భూపాలపల్లి: ‘బయోమెట్రిక్ హాజరు విధానాన్ని తప్పనిసరిగా నమోదు చేయాలి’

అన్ని శాఖల అధికారులు, సిబ్బంది బయోమెట్రిక్ హాజరు విధానాన్ని తప్పనిసరిగా నమోదు చేయాలని కలెక్టర్ రాహుల్ శర్మ ఆదేశించారు. సోమవారం భూపాలపల్లిలోని ఐడీఓసీలో బయోమెట్రిక్ హాజరు నమోదుపై అన్ని శాఖల అధికారులతో సమావేశం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ..శాఖల వారీగా బయోమెట్రిక్ హాజరు నమోదు తప్పనిసరి చేస్తూ, బయోమెట్రిక్ హాజరు పరిశీలన ఆధారంగా మాత్రమే వేతనాలు చెల్లించే విధానం అమలు చేయనున్నట్లు స్పష్టం చేశారు.

సమస్యల పరిష్కరానికి చర్యలు తీసుకోవాలి: భూపాలపల్లి కలెక్టర్

ప్రజావాణి కార్యక్రమంలో వచ్చిన దరఖాస్తుల పరిష్కారానికి అధికారులు చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ తెలిపారు. సోమవారం భూపాలపల్లిలోని ఐడీఓసీలో ప్రజల నుంచి ఆయన 37 దరఖాస్తులు స్వీకరించి, పరిష్కరానికి చర్యలు తీసుకోవాలని సబంధిత అధికారులకు ఎండార్స్‌మెంట్ చేశారు. తదుపరి ప్రజావాణి వరకు జీరో పెండింగ్ ఉండేలా చర్యలు తీసుకోవాలని ఆయన స్పష్టం చేశారు.