News November 19, 2025

ప్రజల అవసరాలకు అనుగుణంగా పనిచేయాలి: KMR SP

image

కామారెడ్డి ఎస్పీ రాజేష్ చంద్ర దేవునిపల్లి పోలీస్ స్టేషన్‌ను మంగళవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. రికార్డులు, రిసెప్షన్, లాక్-అప్ రూమ్ సహా అన్ని విభాగాలను పరిశీలించారు. సైబర్ క్రైమ్, ఆన్‌లైన్ మోసాలు, మూఢనమ్మకాలు వంటి అంశాలపై గ్రామాల్లో అవగాహన పెంచాలని సూచించారు. ప్రజా ఫిర్యాదుల్లో ఎలాంటి జాప్యం చేయకుండా తక్షణమే స్పందించాలని ఎస్పీ సూచించారు. ASP చైతన్య రెడ్డి, CI రామన్, SHO రంజిత్ పాల్గొన్నారు.

Similar News

News March 13, 2026

42 ఏళ్లు కోమాలో ఉన్న అరుణ గురించి తెలుసా?

image

12 ఏళ్లుగా కోమాలో ఉన్న హరీశ్ రాణా(32) కారుణ్య మరణానికి సుప్రీంకోర్టు ఇటీవల <<19352489>>అనుమతిచ్చింది.<<>> ఈ తీర్పునకు ముంబైకి చెందిన నర్సు అరుణా షాన్‌బాగ్ కేసు స్ఫూర్తి. 1973లో ఆమెను రేప్ చేసి దాడి చేయడంతో 42 ఏళ్లపాటు కోమాలో ఉండి 2015లో చనిపోయారు. 2009లో ఆమె కారుణ్య మరణం కోసం ఓ జర్నలిస్టు పిల్ దాఖలు చేయగా సుప్రీంకోర్టు తిరస్కరించింది. అయితే 2011, 2018, 2023లో వెలువడిన తీర్పులు కారుణ్య మరణాన్ని చట్టబద్ధం చేశాయి.

News March 13, 2026

కారుణ్య మరణంపై 2011, 2018 తీర్పులు ఏం చెప్పాయి?

image

సరైన రక్షణ చర్యలు, స్థానిక హైకోర్టు ఆమోదంతో <<19352489>>కారుణ్య మరణానికి<<>> చట్టబద్ధత ఉంటుందని 2011లో సుప్రీం వెల్లడించింది. కోలుకోవడం సాధ్యం కానప్పుడు లైఫ్ సపోర్టును తొలగించవచ్చని, దీనిపై పార్లమెంటులో చట్టం చేయాలని సూచించింది. ఆర్టికల్ 21 గౌరవప్రదంగా జీవించే హక్కుతోపాటు గౌరవప్రదంగా మరణించే హక్కునూ కల్పిస్తుందని 2018లో పేర్కొంది. 2023లో పలు సవరణలతో కారుణ్య మరణంపై తుది తీర్పు వెలువడింది.

News March 13, 2026

గద్వాల్: పరీక్షా కేంద్రాల్లో ‘సీసీ’ నిఘా.. ఫోన్లకు నో ఎంట్రీ..!

image

గద్వాల్ జిల్లాలో పరీక్షల నిర్వహణకు అధికారులు పకడ్బందీ ఏర్పాట్లు చేశారు. 40 పరీక్షా కేంద్రాల్లో సీసీ కెమెరాలను ఏర్పాటు చేసి, వాటిని నేరుగా డీఈవో కార్యాలయానికి అనుసంధానిస్తున్నారు. సీసీ కెమెరాల ముందే ప్రశ్నాపత్రాలను ఓపెన్ చేసి విద్యార్థులకు అందజేస్తారు. విద్యార్థులు, సిబ్బంది ఎవరికీ సెల్‌ఫోన్లకు అనుమతి లేదు. సమస్యాత్మక కేంద్రాలకు ప్రత్యేక వాహనాలు, పోలీసు భద్రత కల్పించారు.