News November 19, 2025

ములుగు: పడిపోతున్న పగటి ఉష్ణోగ్రతలు!

image

ములుగు జిల్లాలో రోజు రోజుకు పగటి ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయి. నవంబర్ మొదటి వారంలో 30 సెంటీగ్రేట్లకు పైగా ఉష్ణోగ్రత నమోదు కాగా.. ప్రస్తుతం జిల్లాలో అత్యల్పంగా 11 సెంటిగ్రేడ్ల ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. జిల్లాలో క్రమక్రమంగా ఉష్ణోగ్రతలు పడిపోవడంతో చలి తీవ్రత పెరిగింది. దీంతో ప్రజలు చలి తీవ్రతలు ఎదుర్కొనేందుకు తగు సంరక్షణ చర్యలు తీసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.

Similar News

News March 7, 2026

ఎన్టీఆర్: బీఈడీ విద్యార్థులకు అలర్ట్.. పరీక్షల షెడ్యూల్ విడుదల

image

ఆచార్య నాగార్జున యూనివర్శిటీ (ANU) పరిధిలోని కాలేజీలలో బీఈడీ విద్యార్థులు రాయాల్సిన 4వ సెమిస్టర్ రెగ్యులర్ థియరీ పరీక్షల షెడ్యూల్ విడుదలైంది. ఈ పరీక్షలు ఏప్రిల్ 27 నుంచి నిర్వహిస్తామని.. విద్యార్థులు ఎలాంటి ఫైన్ లేకుండా ఏప్రిల్ 1వ తేదీ లోపు, రూ.100 ఫైన్‌తో 2వ తేదీ లోపు ఫీజు చెల్లించాలని ANU సూచించింది. వివరాలకు https://www.nagarjunauniversity.ac.in/ చూడాలంది.

News March 7, 2026

KNR: సన్న బియ్యం ముచ్చటగా మూడు నెలల కోటా..!

image

ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని పేదలకు ప్రభుత్వం ఊరటనిచ్చే నిర్ణయం తీసుకుంది. ఆహార భద్రత కార్డు కలిగిన లబ్ధిదారులకు ఏప్రిల్, మే, జూన్ నెలలకు సంబంధించిన కోటా బియ్యాన్ని ఒకేసారి పంపిణీ చేసేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సన్నాహాలు చేస్తున్నాయి. గతేడాది మాదిరిగానే ఈ నెలాఖరులోపు గోదాముల నుంచి రేషన్ దుకాణాలకు 3 నెలకు సంబంధించిన సన్న బియ్యం నిల్వలను తరలించేందుకు సిద్ధమవుతున్నారు.

News March 7, 2026

భారత్ వద్ద 4వేల కోట్ల లీటర్ల ముడి చమురు!

image

భారత్ వద్ద 25 రోజులకే ఆయిల్ రిజర్వులు ఉన్నాయన్న వార్తలను ప్రభుత్వం ఖండించింది. ప్రస్తుతం భారత్ వద్ద సుమారు 4,000 కోట్ల లీటర్ల (250 మిలియన్ బ్యారెళ్ల) ముడి చమురు, పెట్రోలియం నిల్వలు ఉన్నాయని తెలిపింది. ఇవి పూర్తి స్థాయిలో 7 – 8 వారాలకు సరిపోతాయని వివరించింది. విశాఖపట్నం, మంగళూరు, పడూరులోని భూగర్భ కేంద్రాలు & టెర్మినళ్లలో ఈ నిల్వలు సురక్షితంగా ఉన్నాయని వెల్లడించింది. తప్పుడు వార్తలు నమ్మొద్దంది.