News November 19, 2025

KNR: వచ్చే నెలలోనే స్థానిక సమరం.. పల్లెల్లో సందడి వాతావరణం..!

image

బీసీ రిజర్వేషన్లపై ప్రతిష్ఠంభన సోమవారం జరిగిన రాష్ట్ర క్యాబినెట్ భేటీతో వీడింది. దీంతో పల్లెల్లో స్థానిక సమరం షురూ కానుంది. డిసెంబర్‌లో పంచాయతీ ఎన్నికలు నిర్వహించేందుకు ప్రభుత్వం తాజాగా పచ్చజెండా ఊపింది. కేవలం పార్టీ పరంగానే బీసీలకు 42% రిజర్వేషన్లను కల్పించడానికి నిర్ణయించింది. ఇక ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో మొత్తం 1,216 గ్రామపంచాయతీలు ఉండగా, 60 ZPTC, 646 MPTC స్థానాలు ఉన్నాయి. SHARE IT.

Similar News

News March 21, 2026

మోదీనే అతిపెద్ద చొరబాటుదారుడు: సీఎం మమత

image

బెంగాల్ ఎన్నికల్లో అక్రమ వలసల అంశం బీజేపీకి ప్రచారాస్త్రంగా మారిన వేళ ఆ రాష్ట్ర సీఎం మమతా బెనర్జీ దీనిపై కౌంటర్ ఇచ్చారు. బెంగాల్‌ను టార్గెట్ చేసేవారు నరకానికి వెళ్తారని.. ప్రధాని మోదీ, ఆయన ప్రభుత్వమే అతిపెద్ద చొరబాటుదారులని విమర్శించారు. కోల్‌కతాలోని ఈద్ ఈవెంట్‌‌లో ఈ వ్యాఖ్యలు చేశారు. కాగా ఇప్పటికే SIRపైనా మమత విమర్శలు గుప్పించారు. BJP ప్రజల హక్కులను లాక్కోవాలని ప్రయత్నిస్తోందని ఆరోపించారు.

News March 21, 2026

7 కేజీల బరువు తగ్గా: శ్రేయస్

image

గాయం కారణంగా గతేడాది తనకు కష్టంగా గడిచిందని PBKS కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ వెల్లడించారు. దాదాపు 7KGల బరువు తగ్గినట్లు తెలిపారు. గాయం నుంచి కోలుకొని మళ్లీ బరువు పెరిగి ఫిట్‌నెస్ సాధించడానికి తీవ్రంగా కష్టపడినట్లు గుర్తు చేసుకున్నారు. తనకు ఛాలెంజెస్ అంటే ఇష్టమన్నారు. ‘2025 IPLలో రన్నరప్‌గా నిలిచాం. ఈ ఏడాది మా జట్టుపై భారీ అంచనాలున్నాయి. నా కన్ను ట్రోఫీపైనే ఉంది’ అని పేర్కొన్నారు.

News March 21, 2026

సీఎం రేవంత్ రెడ్డికి హరీశ్ రావు బహిరంగ లేఖ

image

సీఎం రేవంత్ రెడ్డి సిద్దిపేట పర్యటన నేపథ్యంలో మాజీ మంత్రి హరీశ్ రావు బహిరంగ లేఖ రాశారు. బీఆర్ఎస్ హయాంలో నిర్మించిన ఆయిల్‌పామ్ ఫ్యాక్టరీని ఇప్పుడు ప్రారంభించడంపై విమర్శలు గుప్పించారు. నియోజకవర్గంలో నిలిపివేసిన రూ.1,070 కోట్ల అభివృద్ధి పనులను వెంటనే పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు. అలాగే పెండింగ్‌లో ఉన్న రైతు రుణమాఫీ, రైతు భరోసా నిధులను తక్షణమే విడుదల చేయాలని కోరారు.