News November 17, 2025

PDPL: చేపపిల్లల సరఫరా టెండర్లకు దరఖాస్తుల ఆహ్వానం

image

పెద్దపల్లి జిల్లా మత్స్యశాఖ 2025- 26 చేపపిల్లల పంపిణీ కోసం సరఫరాదారుల నుంచి ఆన్‌లైన్ టెండర్లను ఆహ్వానించిందని జిల్లా మత్స్యశాఖ అధికారి పి.నరేష్ కుమార్ నాయుడు సోమవారం తెలిపారు. రేపటి నుంచి టెండర్ పత్రాలు డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. నవంబర్ 19న ఫ్రీ బిడ్ మీటింగ్ అదనపు కలెక్టర్ ఛాంబర్‌లో జరగనుంది. నవంబర్ 21న ఉదయం 10:30 నుంచి నవంబర్ 25 మధ్యాహ్నం 3 గంటల వరకు బిడ్లు దాఖలు చేయవచ్చని అధికారి సూచించారు.

Similar News

News November 17, 2025

ప్రియ జనులారా.. ఉచితమంటే ఎగబడకండి!

image

చాలా మందికి ఉచితం అనే సరికి ఎగబడటం పరిపాటైంది. దీనిమాటున ప్రమాదం పొంచి ఉన్నా గుర్తించట్లేదు. తాజాగా <<18309732>>iBOMMA<<>> విషయంలోనూ ఇదే రుజువైంది. ఉచితంగా సినిమా చూసే క్రమంలో తమకు తెలియకుండానే సమాచారాన్ని వారికి చేరవేశారు. ఈ క్రమంలో 50లక్షల మంది డేటా వారి చేతికి చిక్కిందని పోలీసులు వెల్లడించారు. దీంతో ఫ్రీగా వస్తుందనే సరికి ఆన్‌లైన్‌లో ముందూ వెనకా చూడకుండా వ్యవహరిస్తే ప్రమాదమని టెక్ నిపుణులు హెచ్చరిస్తున్నారు.

పోక్సో కేసులో వ్యక్తికి జీవిత ఖైదు

image

పోక్సో కేసులో వ్యక్తికి జీవిత ఖైదు, రూ.10 వేల జరిమానా విధిస్తూ కొత్తగూడెం మొదటి అదనపు జిల్లా న్యాయమూర్తి ఎస్. సరిత మంగళవారం తీర్పు చెప్పారు. చంద్రుగొండ మండలం తిప్పనపల్లి గ్రామానికి చెందిన యువతిని అదే గ్రామానికి చెందిన సయ్యద్ లాలూ అత్యాచారం చేశారు. కేసు నమోదు చేసి కోర్టులో చార్జ్ షీట్ దాఖలు చేశారు. 14 మంది సాక్షులను విచారించగా నేరం రుజువు కావడంతో శిక్ష పడింది.