News November 17, 2025
నంద్యాల: ‘కొనుగోలు కేంద్రాలపై స్పష్టత ఇవ్వాలి’

మొక్కజొన్న కొనుగోలు కేంద్రాల ఏర్పాటుపై స్పష్టత ఇవ్వాలని రైతు సంఘం రాష్ట్ర కార్యదర్శి ఎం. హరిబాబు, జిల్లా కార్యదర్శి రామచంద్రుడు డిమాండ్ చేశారు. సోమవారం నంద్యాలలో కలెక్టర్‌ను కలిసి ఈ మేరకు వినతిపత్రం సమర్పించారు. పంట కొనుగోలు కేంద్రాల ఏర్పాటు, మద్దతు ధరల అమలు, పంట నష్టపరిహారం చెల్లింపు, ఎన్యూమరేషన్‌లో లోపాలను సవరించాలని కోరారు. కౌలు రైతులకు ప్రభుత్వ పథకాలు అన్ని అమలు చేయాలని డిమాండ్ చేశారు.
Similar News
News November 17, 2025
హనుమకొండ: కలెక్టర్ స్నేహ శబరీష్‌ను కలిసిన ఆర్మీ అధికారులు

హనుమకొండ జిల్లా కలెక్టరేట్‌లోని కలెక్టర్ ఛాంబర్‌లో జిల్లా కలెక్టర్ స్నేహ శబరీష్‌ను చెన్నైలోని ఆర్మీ రిక్రూటింగ్ డీడీజీ, బ్రిగేడియర్ ఆర్.కె. అవస్థి, సికింద్రాబాద్ ఆర్మీ రిక్రూటింగ్ ఆఫీస్ డైరెక్టర్ కల్నల్ సునీల్ యాదవ్ సోమవారం మర్యాదపూర్వకంగా కలిశారు. హనుమకొండ జవహర్‌లాల్ నెహ్రూ స్టేడియంలో నిర్వహిస్తున్న ఆర్మీ రిక్రూట్‌మెంట్ ర్యాలీకి సంబంధించిన అంశాలపై ఆఫీసర్లు చర్చించారు.

కేయూ జేఏసీ నూతన కమిటీ ఎన్నిక

విద్యార్థుల సమస్యల పరిష్కారం కోసం ఐక్యంగా పోరాటాలు నిర్వహించేందుకు కేయూ నూతన విద్యార్థి జేఏసీని నేతలు ప్రకటించారు. జేఏసీ ఛైర్మన్‌గా ఆరేగంటి నాగరాజ్, వైస్ ఛైర్మన్‌గా కేతపాక ప్రసాద్, కన్వీనర్‌గా కందికొండ తిరుపతి, కో-కన్వీనర్‌గా అల్లం విజయ్, ప్రధాన కార్యదర్శిగా బోస్కా నాగరాజ్, కార్యదర్శిగా జనగాం రాజారాం, కోశాధికారిగా రేగుల నరేశ్ నియమితులయ్యారు.