News November 17, 2025
ఉమ్మడిగా తనిఖీ చేసి ధర నిర్ణయించాలి: అల్లూరి కలెక్టర్

డీ.గొందూరు, కింతలి, పాడేరు బైపాస్ జాతీయ రహదారికి కేటాయించిన భూములు అటవీ, ఉద్యానవనశాఖ, రెవెన్యూ శాఖ కలిసి క్షేత్రస్థాయిలో ఉమ్మడి తనిఖీ చేసి ధర నిర్ణయించాలని కలెక్టర్ దినేశ్ కుమార్ ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్ నుంచి అధికారులతో వీసీ నిర్వహించారు. జాతీయ రహదారి నిర్మాణంలో, జాతీయ పరిహారం చెల్లింపులలో లక్ష్యాలను నిర్దేశించుకుని, ఆ దిశగా భూములు కోల్పోయిన వారికి పరిహారం చెల్లింపులు చేయాలన్నారు.
Similar News
News November 17, 2025
తిరుపతి: చిన్న అప్పన్న బెయిల్ పిటిషన్ డిస్మిస్

నెల్లూరు ఏసీబీ కోర్టులో సోమవారం టీటీడీ కల్తీ నెయ్యి కేసుతో సంబంధం ఉన్న చిన్న అప్పన్న బెయిల్ పిటిషన్‌ను డిస్మిస్ అయ్యింది. ప్రాసిక్యూషన్ తరఫు న్యాయవాది జయశేఖర్ వాదనలతో ఏకీభవిస్తూ న్యాయమూర్తి బెయిల్ పిటిషన్‌ను కొట్టివేశారు. 2 సార్లు హవాలా ద్వారా చిన్న అప్పన్న డెయిరీ కంపెనీ ప్రతినిధుల నుంచి రూ.20 లక్షలు, రూ.30 లక్షలు ఢిల్లీ పటేల్ నగర్ వద్ద 2023లో తీసుకున్నారని కోర్టు దృష్టికి తీసుకొచ్చారు.

AP న్యూస్ అప్‌డేట్స్

*మంత్రి సత్యకుమార్ పేరిట TTD నకిలీ లెటర్లు.. VJA పోలీసులకు PA ఫిర్యాదు
*పరకామణి కేసు వెనుక ఎవరున్నారో తేల్చాలి: మంత్రి పార్థసారథి
*తిరుచానూరు పద్మావతి అమ్మవారికి ప్రభుత్వం తరఫున పట్టువస్త్రాలు సమర్పించిన మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి
*డిజిటల్ అరెస్టుల కట్టడికి ‘సైబర్ సురక్ష’ పేరిట నెల రోజులపాటు VJA పోలీసుల అవగాహన కార్యక్రమాలు
*రాజధాని రైతుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని JAC నిర్ణయం