News November 17, 2025

KNR: ఓపెన్ స్కూల్ సొసైటీలో భారీ SCAM

image

ఓపెన్ స్కూల్ స్టడీ సెంటర్లో రూ.కోటి వరకు కుంభకోణం జరిగినట్లు తెలుస్తోంది. స్టడీ సెంటర్ల నిర్వహణ కోసం వచ్చిన నిధుల్లో అవకతవకలు జరిగినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో 180 ఓపెన్ స్కూల్ స్టడీ సెంటర్లు ఉండగా.. ఒక్కో స్టడీ సెంటర్‌కు రూ.30వేల వరకు నిర్వహణ కోసం ప్రభుత్వం మంజూరు చేస్తుంది. ఇంతకుముందు కో- ఆర్డినేటర్‌గా పనిచేసిన ఉద్యోగికి ఈ కుంభకోణంలో ప్రమేయం ఉన్నట్లు ఆరోపణలు ఉన్నాయి.

Similar News

News November 17, 2025

చలి పెరిగింది గురూ.. జాగ్రత్తగా ప్రయాణించు.!

image

ఉమ్మడి గుంటూరు జిల్లాలో 2 రోజులుగా చలి తీవ్రత పెరుగుతోంది. సాయత్రం నుంచే చలిగాలు పెరగడంతోపాటు, ఉదయానికి చలి తీవ్రత మరింతగా పెరుగుతోంది. నేడు గుంటూరు జిల్లాలో కనీస ఉష్ణోగ్రత 17°సె.గా రికార్డ్ కావడంతో ప్రజలు చలి దుస్తులు ఉపయోగిస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా తెల్లవారుజామున రహదారులు మంచుతో కప్పబడి ఉండటంతో ప్రయాణాలకు తీవ్ర ఆటంకం కలుగుతుంది. తెల్లవారిన తర్వాతే ప్రయాణించాలని అధికారులు సూచిస్తున్నారు.

ఒక్క ప్రాజెక్టు తెచ్చినట్టు నిరూపించినా రాజీనామా చేస్తా: గంటా

image

వైసీపీ హయాంలో మొదలు పెట్టి, పూర్తి చేసి ప్రారంభించిన ఒక్క ప్రాజెక్టు చూపించినా తన పదవికి రాజీనామా చేస్తానని భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు సవాల్ చేశారు. ఎంవీపీ కాలనీ క్యాంపు కార్యాలయంలో సోమవారం మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. తన అయిదేళ్ల పాలనలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం కియా వంటి చెప్పుకోదగ్గ ఒక్క కంపెనీని కూడా రాష్ట్రానికి తీసుకురాలేకపోయిందని మండిపడ్డారు.