News November 19, 2025
కావలి: ప్రేమపేరుతో మోసం.. యువతి ఆత్మహత్యాయత్నం

ప్రేమపేరుతో యువకుడు మోసం చేయడంతో యువతి ఆత్మహత్యాయత్ననికి పాల్పడిన ఘటన కావలిలో చోటుచేసుకుంది. విష్ణాలయం వీధికి చెందిన యువకుడు ఓ యువతిని ఐదు నెలలుగా ప్రేమిస్తున్నానని నమ్మించాడు. పెళ్లి చేసుకోమంటే కులం పేరుతో దూషించి నిరాకరించాడు. దీంతో మనస్తాపానికి చెందిన యువతి ఫినాయిల్ తాగి ఆత్మహత్యయత్నానికి పాల్పడింది. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Similar News
News March 13, 2026
నెల్లూరు జిల్లాలో హోటళ్లు క్లోజ్!

నెల్లూరు జిల్లాలో 2వేల వరకు కమర్షియల్ సిలిండర్స్ ఉన్నాయి. నాలుగు రోజుల నుంచి వీటి సరఫరాను అధికారులు నిలిపివేశారు. దీంతో చాలా చోట్ల హోటల్స్, ఫాస్ట్ ఫుడ్ సెంటర్స్ మూతపడుతున్నాయి. కొందరు విధిలేని పరిస్థితుల్లో డొమెస్టిక్ సిలిండర్లు కొనుగోలు చేసి హోటళ్లు నడిపిస్తున్నారు. ప్రజలు సైతం డొమెస్టిక్ సిలిండర్ల బుకింగ్‌కు ఒకేసారి ప్రయత్నించడంతో కంపెనీలు సర్వర్లను బంద్ చేసినట్లు తెలుస్తోంది.
News March 13, 2026
నెల్లూరు జిల్లాలో రూ.30కోట్ల వసూళ్లు

నెల్లూరు జిల్లాలోని అన్ని గ్రామ పంచాయతీల్లో పన్నుల వసూళ్ల ప్రక్రియ వేగవంతం చేయాలని జిల్లా పంచాయతీ అధికారిణి వసుమతి సూచించారు. ఎంపీడీవోలు, డిప్యూటీ ఎంపీడీవోలతో ఆమె టెలీకాన్పరెన్స్ నిర్వహించారు. మండలాల వారీగా పేరుకుపోయిన పన్నుల వసూళ్లపై సమీక్ష జరిపారు. ఇప్పటి వరకు రూ.30 కోట్ల పన్నులు వసూలు చేయగా.. మిగిలిన రూ.16 కోట్లు ఈ నెల 15వ తేదీలోగా రాబట్టాలని ఆదేశించారు.
News March 13, 2026
యుద్ధం.. నెల్లూరు జిల్లాలో భారీగా తగ్గిన ధరలు

ఏటా వేసవిలో గూడూరు నిమ్మ మార్కెట్లో ధరలు పెరుగుతుంటాయి. ఇప్పుడు ఎండలు మండిపోతున్నా ధరలు పడిపోతున్నాయి. కారణం యుద్ధం. విదేశాలకు ఎగుమతులు ఆగిపోయాయి. చిన్న హోటల్స్ నుంచి 5స్టార్ హోటల్స్ వరకు నిమ్మకాయలు కొంటారు. గ్యాస్ కొరతతో హోటళ్లు మూత పడటంతో ధరలు భారీగా తగ్గిపోయాయి. 2రోజుల కిందట KG నిమ్మకాయలు రూ.110 ఉండగా నేడు కేజీ రూ.80-రూ.85 మాత్రమే ఉంది. మరింత తగ్గే అవకాశాలు ఉన్నాయని వ్యాపారులు చెబుతున్నారు.


