News November 17, 2025
సత్వర న్యాయం అందించడమే లక్ష్యం: ఎస్పీ

ప్రజలకు సత్వర న్యాయం అందించేందుకే పీజీఆర్‌ఎస్ నిర్వహిస్తున్నట్లు ఎస్పీ బిందు మాధవ్ తెలిపారు. సోమవారం కాకినాడ జిల్లా పోలీస్ కార్యాలయంలో ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. మొత్తం 58 అర్జీలు అందగా, వాటిలో 13 భూతగాదాలు, 18 కుటుంబ కలహాలు, 27 ఇతర విభాగాలకు చెందినవి ఉన్నాయి. ఈ అర్జీలను వెంటనే పరిష్కరించాలని ఆయా పోలీస్ స్టేషన్ల ఎస్.హెచ్.ఓ.లకు ఎస్పీ ఆదేశాలు జారీ చేశారు.
Similar News
News November 17, 2025
చలి పెరిగింది గురూ.. జాగ్రత్తగా ప్రయాణించు.!

ఉమ్మడి గుంటూరు జిల్లాలో 2 రోజులుగా చలి తీవ్రత పెరుగుతోంది. సాయత్రం నుంచే చలిగాలు పెరగడంతోపాటు, ఉదయానికి చలి తీవ్రత మరింతగా పెరుగుతోంది. నేడు గుంటూరు జిల్లాలో కనీస ఉష్ణోగ్రత 17°సె.గా రికార్డ్ కావడంతో ప్రజలు చలి దుస్తులు ఉపయోగిస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా తెల్లవారుజామున రహదారులు మంచుతో కప్పబడి ఉండటంతో ప్రయాణాలకు తీవ్ర ఆటంకం కలుగుతుంది. తెల్లవారిన తర్వాతే ప్రయాణించాలని అధికారులు సూచిస్తున్నారు.

ఒక్క ప్రాజెక్టు తెచ్చినట్టు నిరూపించినా రాజీనామా చేస్తా: గంటా

వైసీపీ హయాంలో మొదలు పెట్టి, పూర్తి చేసి ప్రారంభించిన ఒక్క ప్రాజెక్టు చూపించినా తన పదవికి రాజీనామా చేస్తానని భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు సవాల్ చేశారు. ఎంవీపీ కాలనీ క్యాంపు కార్యాలయంలో సోమవారం మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. తన అయిదేళ్ల పాలనలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం కియా వంటి చెప్పుకోదగ్గ ఒక్క కంపెనీని కూడా రాష్ట్రానికి తీసుకురాలేకపోయిందని మండిపడ్డారు.