News November 19, 2025
బాలకృష్ణతో మరో సినిమా: అంబికా కృష్ణ

ఏలూరు: సినీ నటుడు నందమూరి బాలకృష్ణ తో ఏలూరు మాజీ ఎమ్మెల్యే అంబికా కృష్ణ మంగళవారం రాత్రి వైజాగ్‌లో భేటీ అయ్యారు. ఈ నేపథ్యంలోనే బాలకృష్ణను అంబికా కృష్ణ సాలువా కప్పి సత్కరించారు. ఈ సందర్భంగా అంబికా కృష్ణ మాట్లాడుతూ..బాలయ్యతో విడదీయరాని అనుబంధం ఉందన్నారు. ప్రేక్షకులు మెచ్చే కథ లభ్యమైతే బాలకృష్ణతో మరో చిత్రం నిర్మిస్తానన్నారు. ప్రస్తుతం కథల అన్వేషణలో ఉన్నామన్నారు.
Similar News
News March 18, 2026
ఉగాది పండుగను ఘనంగా నిర్వహిద్దాం: డీఆర్‌వో

నూతన తెలుగు సంవత్సరాది ఉగాది పండుగను ఘనంగా నిర్వహిద్దామని డీఆర్‌వో మలోల పేర్కొన్నారు. బుధవారం మధ్యాహ్నం రెవెన్యూ భవనంలో వివిధ శాఖల అధికారులతో సమావేశం నిర్వహించారు. మొదట వేద పండితుల ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు, భక్తి గీతాలపన, పంచాంగ శ్రవణం, సంప్రదాయ నృత్య ప్రదర్శన ఉంటాయన్నారు. ఈ కార్యక్రమానికి ప్రతి ఒక్కరూ హాజరు కావాలన్నారు.

అధికారం పీకేసినా అదే అహంకారం: CM

TG: కేసీఆర్ అసెంబ్లీకి వచ్చి చర్చలో పాల్గొనాలని సీఎం రేవంత్ రెడ్డి కోరారు. ‘కొందరు ఇంకా తమను తాము రాజులుగా భావించుకుంటున్నారు. రాజులు పోయినా, రాజ్యాలు పోయినా రాచరిక పోకడలు పోలేదు. ప్రతిపక్షంలో కూర్చోబెట్టినా వారి తీరు మారలేదు. అధికారంలో ఉన్నప్పుడు అదే అహంకార ధోరణి.. అధికారం పీకేసినా అదే అహంకారం. గవర్నర్‌కు శుభాకాంక్షలు చెప్పడానికి కూడా ప్రతిపక్ష నాయకుడు సభకు రాలేదు’ అని అసెంబ్లీలో విమర్శించారు.