News November 17, 2025

హనుమకొండ: కెప్టెన్ లక్ష్మీకాంతరావుతో దాస్యం భేటీ

image

కెప్టెన్ లక్ష్మీకాంతరావుతో బీఆర్ఎస్ హనుమకొండ జిల్లా అధ్యక్షుడు దాస్యం వినయ్ భాస్కర్, మాజీ ఎమ్మెల్యే సతీశ్ కుమార్, మాజీ జడ్పీ ఛైర్మన్ సుధీర్ కుమార్ భేటీ అయ్యారు. జిల్లాలో ప్రస్తుత రాజకీయ పరిణామాలపై నేతలు ముచ్చటించి బీఆర్ఎస్ పార్టీ బలోపేతానికి తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు. నేతలు పులి రజనీకాంత్, తదితరులు పాల్గొన్నారు.

Similar News

News November 17, 2025

పెళ్లి రోజునే మరణశిక్ష విధించారు

image

బంగ్లాదేశ్ మాజీ PM షేక్ హసీనాకు <<18311087>>ఉరిశిక్ష<<>> విధించిన సంగతి తెలిసిందే. ఈ తేదీతో ఆమెకు మధురమైన జ్ఞాపకాలు ఉన్నాయి. 1967లో సరిగ్గా ఇదే తేదీన శాస్త్రవేత్త వాజెద్ మియాను హసీనా పెళ్లి చేసుకున్నారు. దీంతో పెళ్లి రోజునే ఉద్దేశపూర్వకంగా ఆమెకు మరణశిక్ష విధించారని పలువురు కామెంట్స్ చేస్తున్నారు. బంగ్లాదేశ్ స్థానిక మీడియా కూడా ఇదే విషయాన్ని ప్రస్తావించడంతో ఇది రాజకీయ ప్రతీకారమేనని విమర్శిస్తున్నారు.

భీమవరం: దత్తత అవగాహన కార్యక్రమ గోడ పత్రిక ఆవిష్కరణ

image

జిల్లాలో ప్రత్యేక అవసరాలు కలిగిన పిల్లలను గుర్తించి దత్తత తీసుకొని ప్రోత్సహించేలా అవగాహన కల్పించాలని కలెక్టర్ నాగరాణి అన్నారు. సోమవారం భీమవరం కలెక్టరేట్లో దత్తత అవగాహన కార్యక్రమ గోడ పత్రికను ఆవిష్కరించారు. స్వచ్ఛంద సేవా సంస్థలు లేదా ఎక్కడైనా ప్రత్యేక అవసరాలు కలిగిన పిల్లలు ఉంటే గుర్తించి దత్తత ఇవ్వడానికి ప్రోత్సహించాలన్నారు. దత్తత ప్రక్రియను నిబంధనల మేరకు నిర్వహించాలన్నారు.