News November 19, 2025
MBNR: పవిత్ర పుణ్య క్షేత్రాలకు డీలక్స్ బస్

మహబూబ్ నగర్ నుంచి పవిత్ర పుణ్య క్షేత్రాలకు ప్రత్యేక డీలక్స్ బస్ నడుపుతున్నట్లు డిపో మేనేజర్ సుజాత ‘Way2News’తో తెలిపారు. ఈనెల ఉదయం 6:00 గంటలకు మహబూబ్ నగర్ నుంచి కొల్లాపూర్ సమీపంలోని పవిత్ర క్షేత్రాలు సోమశిల & సింగోటంకు బస్ వెళ్తుందని, తిరిగి సాయంత్రం 7:00 గంటలకు వస్తుందన్నారు. ఒక్కరికి ఛార్జీ: రూ.500. పూర్తి వివరాలకు 70136 46089, 93989 62021కు సంప్రదించాలని కోరారు.
Similar News
News March 21, 2026
MHBD: పురుగు మందు తాగిన బాలుడి మృతి

మహబూబాబాద్ జిల్లా గార్ల మండలం పూసలతండకు చెందిన గుగులోత్ పవన్ పురుగు మందు తాగి మృతి చెందాడు. గుగులోత్ రాందాస్, స్వరూప కుమారుడైన పవన్(3వ తరగతి)స్కూలుకు వెళ్లడం లేదని తల్లి మందలించింది. ఇంట్లో ఎవరు లేని సమయంలో బాలుడు పురుగు మందు తాగాడు. రెండు రోజులు తర్వాత తన తల్లికి చెప్పడంతో వెంటనే హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ హాస్పిటల్‌లో చేర్పించారు. చికిత్స పొందుతూ బాలుడు మృతి చెందడంతో విషాధచాయలు అలముకున్నాయి.
News March 21, 2026
బాపట్ల: నాడు సినీ బౌన్సర్.. నేడు దొంగ

దొంగతనాలకు పాల్పడుతున్న వ్యక్తిని చందోలు పోలీసులు అరెస్ట్ చేసినట్లు శనివారం స్థానిక పోలీస్ స్టేషన్‌లో బాపట్ల DSP జగదీష్ నాయక్ వెల్లడించారు. పిట్టలవానిపాలెం మండలం రెడ్డిపాలెంలో సిబ్బంది వాహన తనిఖీలు చేపట్టారు. ఈనెల 7న దొంగతనం చేసిన నిందితుడు ఆటో దిగి పారిపోతుండగా అదుపులోకి తీసుకున్నారు. అతను గతంలో సినీ ఫీల్డ్‌లో బౌన్సర్‌గా చేశాడన్నారు.
News March 21, 2026
ఈనెల 23న ₹1.35లక్షల కోట్ల ప్రాజెక్టుకు సీఎం శంకుస్థాపన

AP: రాష్ట్ర పారిశ్రామిక రంగంలో మరో కీలక ముందడుగు పడనుంది. ప్రతిష్ఠాత్మక ఆర్సెలార్ మిట్టల్ – నిప్పాన్ స్టీల్ ఇండియా ప్రాజెక్టుకు సీఎం చంద్రబాబు ఈనెల 23న శంకుస్థాపన చేయనున్నారు. అనకాపల్లి జిల్లా నక్కపల్లి మండలంలోని రాజయ్యపేటలో ₹1,35,964 కోట్లతో ఇది ఏర్పాటు కానుంది. ఏటా 17.8 మిలియన్ మెట్రిక్ టన్నుల ఉత్పత్తే లక్ష్యంగా 5,465 ఎకరాల్లో రెండు ఫేజుల కింద దీనిని నిర్మిస్తున్నారు.


