News April 13, 2024
ఏలూరు జిల్లాలో బాలికపై అత్యాచారయత్నం

ఏలూరు జిల్లా టి.నరసాపురం మండలం జగ్గవరం గ్రామంలో ఓ వ్యక్తి దారుణానికి ఒడిగట్టాడు. పోలీసుల వివరాల ప్రకారం.. జగ్గవరానికి చెందిన ఏడేళ్ల బాలికను అదే గ్రామానికి చెందిన లక్ష్మణరావు ఇంటికి తీసుకువెళ్లి చీమలు తొలగిస్తానని చెప్పి ఆమె దుస్తులు తీసేసి అత్యాచారానికి యత్నించాడు. ఇంటికి వచ్చిన బాలిక శరీరంపై గాయాలు గుర్తించిన తల్లి.. పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు లక్ష్మణరావుపై కేసు నమోదు చేశారు.
Similar News
News March 16, 2026
ఏపీ కేబినెట్ విస్తరణ.. పితానికి బెర్త్ ఖాయమేనా?

కూటమి ప్రభుత్వం ఏర్పడి రెండేళ్లు కావస్తుండటంతో మంత్రివర్గ విస్తరణపై చర్చ మొదలైంది. ప్రస్తుతం జిల్లా నుంచి నిమ్మల రామానాయుడు ప్రాతినిధ్యం వహిస్తుండగా, కొత్తగా ఎవరికి చోటు దక్కుతుందనే ఉత్కంఠ నెలకొంది. ఆచంట MLA పితాని సత్యనారాయణ పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. సీనియార్టీ, బీసీ సామాజికవర్గం, గతంలో మంత్రిగా పనిచేసిన అనుభవం పితానికి కలిసివచ్చే అంశాలని విశ్లేషకులు భావిస్తున్నారు.
News March 16, 2026
ప.గో: మళ్లీ పాత చోటకే PGRS వేదిక

గొల్లల కోడేరు జిల్లా SP కార్యాలయంలో సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక (PGRS) యథావిధిగా నిర్వహించనున్నట్లు SP అద్నాన్ నయీం అస్మి తెలిపారు. గతంలో రోడ్డు పనుల వల్ల భీమవరం వన్ టౌన్ పోలీస్ స్టేషన్లో ఈ కార్యక్రమం జరిగేదని, పనులు పూర్తి కావడంతో తిరిగి SP కార్యాలయానికి మార్చినట్లు వెల్లడించారు. అర్జీదారులు ఈ మార్పును గమనించి తమ సమస్యల విన్నపానికి నేరుగా SP కార్యాలయానికి రావాలని కోరారు.
News March 16, 2026
ప.గో: సీఆర్పీలకు ఐదు నెలలుగా అందని వేతనాలు

పశ్చిమ గోదావరి జిల్లాలోని గ్రామాల్లో తడి, పొడి చెత్తపై అవగాహన కల్పించేందుకు ప్రభుత్వం నియమించిన సీఆర్పీలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. నియామకమై ఐదు నెలలు గడుస్తున్నా ఇంతవరకు వేతనాలు అందకపోవడంతో నిరుద్యోగులు ఆందోళన చెందుతున్నారు. తమ ఉద్యోగ భద్రతపై అధికారుల నుంచి సరైన స్పందన లేకపోవడంతో గందరగోళం నెలకొందని, తక్షణమే ఉన్నతాధికారులు స్పందించి బకాయిలు చెల్లించాలని వారు డిమాండ్ చేస్తున్నారు.


