News November 19, 2025
మహబూబ్‌నగర్: ఎస్సీ విద్యార్థులకు ప్రీ మెట్రిక్ స్కాలర్‌షిప్‌లు

మహబూబ్‌నగర్ జిల్లా ఎస్సీ విద్యార్థులకు 2025-26 విద్యా సంవత్సరానికి ప్రీ-మెట్రిక్ ఉపకార వేతనాలను రాష్ట్ర ప్రభుత్వం అందిస్తోంది. 5 నుంచి 10వ తరగతి చదువుతున్న వారికి సంవత్సరానికి రూ.1,000 నుంచి రూ.3,500 వరకు అందజేస్తారు. అర్హులైన విద్యార్థులు కుల, ఆదాయ ధ్రువపత్రాలు, ఆధార్ కార్డుతో ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని జిల్లా షెడ్యూల్డ్ కులాల శాఖ అధికారి ఒక ప్రకటనలో తెలిపారు.
Similar News
News March 13, 2026
వికారాబాద్‌లో మసాలా దోశ రూ.60 అంట!

ఇటీవలి గ్యాస్ కొరతతో టిఫిన్ సెంటర్లలో ధరలు పెరుగుతున్నాయి. ఓ టిఫిన్ సెంటర్‌లో మసాలా దోశ ధర రూ.60గా నిర్ణయించడంతో కస్టమర్లు నోరెళ్లబెడుతున్నారు. కారణం అడగగా, గ్యాస్ కొరతతో, ఖర్చులు పెరిగినందున ధరలు పెంచాల్సి వచ్చిందని నిర్వాహకులు తెలిపారు. దీనిపై ఎవరికి కంప్లైంట్ చేయాలని, ఈ పరిస్థితి ఎప్పటికి అదుపులోకి వస్తుందని ప్రశ్నిస్తున్నారు.
News March 13, 2026
ఇరాన్‌లో ఈరోజు ఏం జరుగుతుందో చూడండి: ట్రంప్

ఇరాన్‌పై నేడు విరుచుకుపడనున్నట్లు అమెరికా హింట్ ఇచ్చింది. ఈరోజు ఏం జరుగుతుందో చూడండని ట్రంప్ ప్రకటించారు. ఇరాన్‌కు నేవీ, ఎయిర్ ఫోర్స్ లేవని.. మిసైల్స్, డ్రోన్లను కూడా ధ్వంసం చేస్తున్నామన్నారు. US అంచనా తప్పిందన్న కథనాలకు కౌంటర్ ఇస్తూ.. వాటిని చదివి అమెరికా ఓడిపోతోందని భ్రమపడొద్దని ప్రజలకు సూచించారు. 47ఏళ్లుగా అమాయకులను చంపుతున్న వారిని US 47వ అధ్యక్షుడిగా అంతం చేయడం తనకు దక్కిన గౌరవమన్నారు.
News March 13, 2026
VZM: ‘అక్షరాంధ్ర పరీక్షకు 99% హాజరు కావాలి’

ఈనెల 15న నిర్వహించనున్న అక్షరాంధ్ర ఫైనల్ పరీక్షకు 99% హాజరు అయ్యేలా అధికారులు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ రాంసుందర్ రెడ్డి ఆదేశించారు. శుక్రవారం టెలీకాన్ఫిరెన్స్ ద్వారా పరీక్ష ఏర్పాట్లపై సమీక్షించారు. జిల్లాలో 1.10 లక్షల మందిని అక్షరాంధ్ర కింద గుర్తించామని, వారందరూ అక్షరాస్యులుగా మారాలని అన్నారు. పరీక్ష అనంతరం మూల్యాంకనం చేసి మార్కులను యాప్ ద్వారా ఆన్‌లైన్‌లో అప్‌లోడ్ చేయాలని సూచించారు.


