News November 19, 2025
ఇంటర్మీడియట్ పరీక్షల్లో మార్పులు

AP: వచ్చే ఏడాది ఇంటర్ 1st ఇయర్ పరీక్షల్లో బుక్‌లెట్ పేజీలను 24నుంచి 32కు పెంచారు. మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, హిస్టరీ, ఎకనామిక్స్, పొలిటికల్ సైన్స్, కామర్స్‌కు 32 పేజీలు ఉంటాయి. బయాలజీలో వృక్షశాస్త్రం, జంతుశాస్త్రానికి 24పేజీల చొప్పున 2 బుక్‌లెట్లు ఇస్తారు. భౌతిక, రసాయన, జీవశాస్త్ర పరీక్షలు 85 మార్కులకు పాస్ మార్క్స్ 29. కొన్ని సబ్జెక్టుల్లో 30% వచ్చినా, మొత్తం 35% ఉంటే పాస్‌గా పరిగణిస్తారు.
Similar News
News March 10, 2026
పుట్టిన రోజు శుభాకాంక్షలు

ఈ రోజు పుట్టినరోజు జరుపుకొంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపరచండి.
News March 10, 2026
అనిల్ రావిపూడి నుంచి యానిమేషన్ మూవీ?

కమర్షియల్ సినిమాలతో వరుస హిట్లు అందుకుంటున్న డైరెక్టర్ అనిల్ రావిపూడి కొత్త జానర్‌లో మూవీ తీసేందుకు ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. లార్జ్ స్కేల్ యానిమేషన్ ప్రాజెక్టుపై ఆయన పనిచేస్తున్నట్లు సినీ వర్గాలు పేర్కొన్నాయి. KVN ప్రొడక్షన్స్ నిర్మించే ఈ ప్రాజెక్టు పట్టాలెక్కేందుకు ఇంకా చాలా టైమ్ పడుతుందని పేర్కొన్నాయి. కాగా ప్రస్తుతం వెంకటేశ్, కళ్యాణ్ రామ్‌తో అనిల్ ఓ మల్టీస్టారర్ సినిమా చేస్తున్నారు.
News March 10, 2026
ఈరోజు నమాజ్ వేళలు (10-3-2026) మంగళవారం

♦︎ సెహర్: తెల్లవారుజామున 5.16 గంటలకు
♦︎ సూర్యోదయం: ఉదయం 6.29 గంటలకు
♦︎ దుహర్: మధ్యాహ్నం 12.27 గంటలకు
♦︎ అసర్: మధ్యాహ్నం 3.49 గంటలకు
♦︎ ఇఫ్తార్: సాయంత్రం 6.25 గంటలకు
♦︎ ఇష: రాత్రి 7.38 గంటలకు
➤ NOTE: ప్రాంతాన్ని బట్టి నమాజ్ వేళల్లో స్వల్ప తేడాలుండొచ్చు.


