News November 17, 2025
నరసరావుపేట: ఎస్పీ కార్యాలయంలో 111 ఫిర్యాదులు

నరసరావుపేట జిల్లా పోలీస్ కార్యాలయంలో నిర్వహించిన పీజీఆర్ఎస్ కార్యక్రమంలో SP కృష్ణారావు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఆయన కుటుంబ, ఆస్తి తగాదాలు, మోసాలకు సంబంధించిన మొత్తం 111 అర్జీలను స్వయంగా స్వీకరించారు. ప్రజా సమస్యల పరిష్కారానికి మొదటి ప్రాధాన్యత ఇవ్వాలని, స్వీకరించిన ఫిర్యాదులను వెంటనే పరిష్కరించాలని ఆయన పోలీసు అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో అడిషనల్ SP సంతోష్, పోలీసు అధికారులు పాల్గొన్నారు.
Similar News
News November 18, 2025
ఏఐ సాంకేతికత ద్వారా శానిటేషన్ నియంత్రణకు చర్యలు: వరంగల్ మేయర్

ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) సాంకేతికత ద్వారా శానిటేషన్ నియంత్రణకు చర్యలు చేపట్టాలని వరంగల్ మేయర్ గుండు సుధారాణి అధికారులను ఆదేశించారు. కమిషనర్ చాహత్ బాజ్ పాయ్‌తో బల్దియా ప్రధాన కార్యాలయంలో గల ఐసీసీసీ కేంద్రంలో క్షేత్ర స్థాయిలో సందర్శించి అక్కడే అధికారులతో ఏర్పాటు చేసిన సమావేశంలో పాల్గొన్నారు. సమర్థవంతంగా నిర్వహించేందుకు తగు సూచనలు చేశారు.

ములుగు: రైతుల ఖాతాల్లో రూ.1. 82 కోట్లు జమ

జిల్లాలో 185 ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో నేటి వరకు 7131.080 మెట్రిక్ టన్నుల ధాన్యం వచ్చినట్లు జిల్లా కలెక్టర్ దివాకర్ టీఎస్ వెల్లడించారు. 17 శాతం తేమతో 3775.120 మెట్టు టన్నులు రైతుల నుంచి కొనుగోలు చేసి మిల్లర్లకు తరలించినట్లు పేర్కొన్నారు. కొనుగోలు చేసిన ధాన్యానికి రూ.1.82 కోట్లు రైతుల ఖాతాల్లో జమ చేశామన్నారు. కొనుగోలు కేంద్రాల్లో టార్పాలిన్ కవర్లు, గన్ని సంచులు అందుబాటులో ఉంచామన్నారు.