News November 17, 2025
ప్రజావాణి దరఖాస్తులపై క్షేత్రస్థాయిలో పరిశీలన చేయాలి: ములుగు కలెక్టర్

ప్రజావాణిలో వచ్చిన దరఖాస్తులను సకాలంలో పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ దివాకర అధికారులకు ఆదేశించారు. అవసరమైతే క్షేత్రస్థాయి పరిశీలన చేయాలన్నారు. ములుగు కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్‌లో జరిగిన గ్రీవెన్స్‌లో ఆయన ప్రజల నుంచి ఫిర్యాదులను స్వీకరించారు. వివిధ సమస్యలకు సంబంధించి మొత్తం 62 దరఖాస్తులు వచ్చాయి. ఆయా శాఖల అధికారులకు బదిలీ చేసి పరిష్కరించాలన్నారు. అదనపు కలెక్టర్లు మహేందర్ జీ, సంపత్ రావు ఉన్నారు.
Similar News
News November 18, 2025
ఏఐ సాంకేతికత ద్వారా శానిటేషన్ నియంత్రణకు చర్యలు: వరంగల్ మేయర్

ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) సాంకేతికత ద్వారా శానిటేషన్ నియంత్రణకు చర్యలు చేపట్టాలని వరంగల్ మేయర్ గుండు సుధారాణి అధికారులను ఆదేశించారు. కమిషనర్ చాహత్ బాజ్ పాయ్‌తో బల్దియా ప్రధాన కార్యాలయంలో గల ఐసీసీసీ కేంద్రంలో క్షేత్ర స్థాయిలో సందర్శించి అక్కడే అధికారులతో ఏర్పాటు చేసిన సమావేశంలో పాల్గొన్నారు. సమర్థవంతంగా నిర్వహించేందుకు తగు సూచనలు చేశారు.

ములుగు: రైతుల ఖాతాల్లో రూ.1. 82 కోట్లు జమ

జిల్లాలో 185 ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో నేటి వరకు 7131.080 మెట్రిక్ టన్నుల ధాన్యం వచ్చినట్లు జిల్లా కలెక్టర్ దివాకర్ టీఎస్ వెల్లడించారు. 17 శాతం తేమతో 3775.120 మెట్టు టన్నులు రైతుల నుంచి కొనుగోలు చేసి మిల్లర్లకు తరలించినట్లు పేర్కొన్నారు. కొనుగోలు చేసిన ధాన్యానికి రూ.1.82 కోట్లు రైతుల ఖాతాల్లో జమ చేశామన్నారు. కొనుగోలు కేంద్రాల్లో టార్పాలిన్ కవర్లు, గన్ని సంచులు అందుబాటులో ఉంచామన్నారు.