News April 13, 2024
‘ప్రతినిధి-2’ విడుదల తేదీ ఫిక్స్

హీరో నారా రోహిత్ నటించిన ‘ప్రతినిధి-2’ చిత్రం విడుదల తేదీ ఫిక్సయింది. జర్నలిస్ట్ మూర్తి దర్శకత్వం వహించిన ఈ సినిమా ఏప్రిల్ 25న ప్రేక్షకుల ముందుకు రానుంది. ‘ప్రతినిధి’ సినిమా 10 సంవత్సరాల క్రితం ఇదే తేదీన విడుదల కావడం విశేషం. ఈ మూవీ నుంచి ఇప్పటికే విడుదలైన టీజర్‌కి విశేష స్పందన వచ్చింది. ఈ సినిమాలో నారా రోహిత్ న్యూస్ రిపోర్టర్ పాత్రలో కనిపించనున్నట్లు తెలుస్తోంది.
Similar News
News March 17, 2026
‘ఉడుతా భక్తి’ అంటే ఏమిటి?

ఎలాంటి స్వార్థం లేకుండా తమ శక్తి మేరకు చేసే చిన్న సహాయం గురించి చెప్పే సందర్భంలో ‘ఉడుతా భక్తి’ జాతీయాన్ని వాడతారు. ఇది రామాయణం నుంచి పుట్టింది. లంకకు రామసేతు నిర్మాణంలో తాను కూడా భాగం కావాలని ఉడుత భావిస్తుంది. నీటిలో తడుస్తూ ఇసుకలో పొర్లాడుతూ ఆ ఇసుకను రాళ్ల మధ్య నింపే ప్రయత్నం చేస్తుంది. అందుకు రాముడు మెచ్చుకొని ఉడుత మీద నిమరడంతో ఏర్పడిన గీతలే ఇప్పటికీ ఉన్నాయని ఓ నమ్మకం.
<<-se>>#EPICSAYINGS<<>>
News March 17, 2026
వంటింటి చిట్కాలు

* నిమ్మజాతి పండ్లు, టమాటాలు ఫ్రిజ్‌లో పెట్టకూడదు.
* వంటింట్లో వాడే స్పాంజీలూ, మసి బట్టల్ని ఉప్పు వేసిన చల్లని నీళ్లలో కాసేపు నానబెట్టి తరువాత ఉతకండి. క్రిములు పోతాయి. దుర్వాసన కూడా ఉండదు.
* పాత్రలు శుభ్రం చేయడానికి ఉపయోగించే నీటిలో కొద్దిగా బేకింగ్ సోడా కలిపితే పాత్రలు నీచు వాసన రావు.
* తేనె ముద్దగా అయితే, కాసేపు అది ఉన్న సీసాను వేడి నీళ్లలో ఉంచితే సరిపోతుంది.
News March 17, 2026
ఒత్తిడి పెరిగితే.. అందం తగ్గిపోతుంది

ఒత్తిడికి ఎక్కువగా గురయ్యే మహిళలు పలు ఆరోగ్య సమస్యలు ఎదుర్కొంటున్నట్లు ఇంటర్నేషనల్ జర్నల్ అఫ్ సైన్స్ అండ్ రీసర్చ్ ప్రచురించిన నివేదికలో పేర్కొన్నారు. ఒత్తిడి వల్ల వృద్ధాప్య ఛాయలు ముందే రావడంతో పాటు నెలసరి సమస్యలు, బీపీ, షుగర్ వంటివి దాడి చేస్తున్నట్లు పరిశోధకులు వెల్లడించారు. ఒత్తిడిని తగ్గించుకోవడానికి సరిపడా నీరు, నిద్ర, పోషకాలున్న ఆహారం, వ్యాయామాలు, ధ్యానం ఉపయోగపడతాయని చెబుతున్నారు.


