News November 19, 2025
నాగర్ కర్నూల్: రేపు కబడ్డీ జట్ల ఎంపికలు

NGKL(D) కబడ్డీ అసోసియేషన్ ఆధ్వర్యంలో కల్వకుర్తి MJP(CBM) కళాశాలలో రేపు కబడ్డీ జట్ల ఎంపికలు నిర్వహిస్తున్నట్లు అధ్యక్షుడు ఎం.జనార్దన్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి యాదయ్య గౌడ్ తెలిపారు. జూనియర్ బాలికలు(31-12-2005) తర్వాత జన్మించి, బరువు 65kgs లోపు, సీనియర్ మహిళలు 75kgs లోపు ఉండాలన్నారు. ఒరిజినల్ బోనోఫైడ్, టెన్త్ మెమో,ఆధార్‌తో హాజరు కావాలన్నారు. వివరాలకు 77803 42434 సంప్రదించాలన్నారు.
Similar News
News March 20, 2026
నెల్లూరు: గురుకుల పాఠశాలలో అడ్మిషన్లు

నెల్లూరు రూరల్ అక్కచెరువుపాడు మైనార్టీ బాలురు గురుకుల పాఠశాలలో 5, 6, 7, 8వ తరగతుల్లో మిగిలి ఉన్న సీట్లకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ప్రిన్సిపల్ మురళీకృష్ణ ఒక ప్రకటనలో తెలిపారు. విద్యార్థులు మార్చి 31వ తేదీ లోపు https://aprs.apcfss.in ద్వారా దరఖాస్తు చేసుకోవాలన్నారు. విద్యార్థులకు ఏప్రిల్ 24వ తేదీన పరీక్ష నిర్వహిస్తారని చెప్పారు.
News March 20, 2026
ఆనందంగా పండుగ జరుపుకోవాలి: కలెక్టర్

జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ రంజాన్ పండుగ సందర్భంగా ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ పవిత్ర మాసంలో ఉపవాసం, ప్రార్థనలు, దానం ద్వారా సహనం, సేవాభావం, సౌభ్రాతృత్వం పెంపొందుతుందని, పండుగ శాంతి, ఐక్యత, సౌహార్ద్రానికి ప్రతీకగా ఉంటుందని ఆయన పేర్కొన్నారు. ప్రతి ఒక్కరు ఆనందంగా, సామరస్యంతో పండుగను జరుపుకోవాలని, సమాజంలో ప్రేమ, పరస్పర గౌరవం బలపడాలని ఆకాంక్షించారు.
News March 20, 2026
కేంద్రీయ విద్యాలయాల్లో అడ్మిషన్లు.. రిజిస్ట్రేషన్లు షురూ

2026-27 విద్యాసంవత్సరానికి గాను కేంద్రీయ విద్యాలయాల్లో(KV) అడ్మిషన్లకు నేటి నుంచి రిజిస్ట్రేషన్ల ప్రక్రియ మొదలైంది. ఒకటో తరగతితోపాటు బాల్ వాటికల్లో ప్రవేశాలకు <
Share It


