News April 13, 2024

చర్లపల్లి జైల్లో డ్రగ్స్ కోసం ఖైదీల ఆందోళన

image

TG: తమకు డ్రగ్స్ కావాలంటూ హైదరాబాద్‌లోని చర్లపల్లి జైలు ఖైదీలు ఆందోళన చేపట్టారు. డ్రగ్స్‌కు అలవాటు పడిన విచారణ ఖైదీలు అక్కడి సిబ్బందిపై తిరగబడ్డారు. దీంతో జైలు అధికారులు నలుగురిని అదుపులోకి తీసుకున్నారు. వారందరినీ ప్రత్యేక బ్యారక్‌లోకి తరలించినట్లు తెలుస్తోంది. దీనిపై జైలు ఉన్నతాధికారులు విచారణ జరుపుతున్నారు.

Similar News

News November 16, 2024

AP అసెంబ్లీ న్యూస్ రౌండప్

image

* టిడ్కో ఇళ్ల అక్రమాలపై విచారణ జరిపించాలి: MLAలు
* 2019కల్లా 313832 ఇళ్లు 90శాతం పూర్తి: GV ఆంజనేయులు
* టిడ్కో ఇళ్లను YCP నేతలు అమ్ముకున్నారు: పల్లా
* సోషల్ మీడియా సైకోలను శిక్షించాలి: గౌతు శిరీష
* తుంగభద్ర గేట్లు మార్చేందుకు నిధులు కేటాయించాలి: కాలవ శ్రీనివాసులు
* మల్లవల్లి పారిశ్రామిక వాడకు భూములు కేటాయించాలి: యార్లగడ్డ
* వెలిగొండపై YCP సినిమా స్టైల్ ప్రచారం: ఉగ్ర నరసింహారెడ్డి

News November 16, 2024

‘మేడిన్ ఇండియా’కు రెస్పెక్ట్ పెరిగింది: వేదాంత ఫౌండర్

image

భారత్‌‌కు, భారతీయులకు, భారతీయ ఉత్పత్తులకు ప్రపంచంలో అత్యధిక డిమాండ్ ఏర్పడిందని వేదాంత ఫౌండర్ అనిల్ అగర్వాల్ అన్నారు. మన దేశం ఈ పరిస్థితికి చేరిన విధానం ఇతర దేశాలు అనుసరించేందుకు ఒక మోడల్‌గా మారిందన్నారు. భారతీయ ప్రతిభావంతులకు ఉద్యోగాలిచ్చేందుకు కంపెనీలు వెంటపడుతున్నాయని తెలిపారు. ‘మేడిన్ ఇండియా’ లేబుల్‌కు ఇప్పుడు గౌరవం పెరిగిందని, దేశంలో అవకాశాలను పెంచిందని HTLS 2024లో వెల్లడించారు.

News November 16, 2024

ఏఆర్ రెహమాన్‌కు ఐఐటీ మద్రాస్ అవార్డు

image

సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్‌కు ఎక్స్‌పీరియెన్షియల్ టెక్నాలజీ ఇన్నోవేషన్ సెంటర్(XTIC) పురస్కారాన్ని మద్రాస్ ఐఐటీ ప్రకటించింది. వర్చువల్ రియాలిటీ సినిమా ‘లే మస్క్’కు పనిచేసినందుకు గాను ఆయనకు ఈ అవార్డు ఇస్తున్నట్లు తెలిపింది. రేపు జరిగే ‘XR’ సదస్సులో ఈ అవార్డును ఆయనకు అందిస్తామని వెల్లడించింది.