News November 19, 2025

నేటి నుంచి పత్తి కొనుగోళ్లు యథాతథం: మంత్రి

image

TG: <<18308868>>జిన్నింగ్<<>> మిల్లర్లతో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు జరిపిన చర్చలు సఫలమయ్యాయి. వారి సమస్యలపై కేంద్రానికి నివేదిక పంపిస్తామని మంత్రి హామీ ఇచ్చారు. నేటి నుంచి పత్తి కొనుగోళ్లను కొనసాగించాలన్నారు. మరోవైపు మొక్కజొన్న కొనుగోలు పరిమితిని ఎకరానికి 18 నుంచి 25 క్వింటాళ్లకు, సోయాబీన్ 6.72 నుంచి 10qlకు పెంచాలని అధికారులను ఆదేశించారు. ఆధార్ అథెంటికేషన్‌తో పాటు మొబైల్ OTP ఆధారంగా కొనుగోళ్లు జరపాలని సూచించారు.

Similar News

News March 15, 2026

రేపటి నుంచి మ.12.30 గం. వరకే స్కూళ్లు

image

తెలుగు రాష్ట్రాల్లో రేపటి నుంచి ఒంటిపూట బడులు ప్రారంభం కానున్నాయి. ఏపీలో 7.45AM నుంచి 12.30PM వరకు తరగతులు నిర్వహించనున్నారు. ప్రభుత్వ, జిల్లా పరిషత్, మున్సిపల్, ఎయిడెడ్, ప్రైవేట్ స్కూళ్లకు ఈ ఆదేశాలు వర్తిస్తాయని అధికారులు తెలిపారు. అటు తెలంగాణలో 8AM నుంచి 12.30PM వరకు తరగతులు ఉంటాయి. రెండు రాష్ట్రాల్లో స్కూల్ ముగిశాక మధ్యాహ్న భోజనం పెట్టి పిల్లలను ఇంటికి పంపించనున్నారు.

News March 15, 2026

యుద్ధం.. ట్రంప్‌కు కామెడీ అయిపోయింది!

image

ప్రపంచ గమనాన్ని మార్చే యుద్ధాలను డొనాల్డ్ ట్రంప్ ఒక ‘కామెడీ’గా మార్చేశారని నిపుణులు మండిపడుతున్నారు. ఖార్గ్ దీవులపై ‘<<19386343>>ఫన్నీ<<>>’గా దాడులు చేస్తామంటూ చేసిన వ్యాఖ్యలు యుద్ధాన్ని ఆయన ఎంత లైట్ తీసుకుంటున్నారో సూచిస్తున్నాయి. మరోవైపు ‘ఈరోజు దారుణంగా దాడి చేస్తాం. ఈ వారంలో ఇరాన్‌ను కోలుకోలేని విధంగా దెబ్బ కొడతాం’ అంటూ చేసే ప్రకటనలు ఆయన బాధ్యతారాహిత్యాన్ని తెలియజేస్తున్నాయని విశ్లేషిస్తున్నారు.

News March 15, 2026

100 కుక్కలకు విషం పెట్టి చంపేశారు

image

TG: మంచిర్యాల జిల్లాలో 100 వీధికుక్కలకు విషం పెట్టి చంపిన ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. ఈ నెల 7-8 తేదీల్లో జన్నారం మం. కిష్టాపూర్‌లో ఈ ఘటన జరిగింది. సర్పంచ్, పంచాయతీ కార్యదర్శి కుక్కలను చంపేందుకు ఇద్దరిని నియమించుకున్నారు. వారు కుక్కలకు విషపూరిత ఇంజెక్షన్లు ఎక్కించారు. అవి చనిపోయాక కళేబరాలను ఓ నది ఒడ్డున పూడ్చి పెట్టారు. జంతు సంక్షేమ కార్యకర్త ఫిర్యాదుతో పోలీసులు సర్పంచ్, PSపై కేసు నమోదు చేశారు.