News November 19, 2025
కర్నూలు: రూ.3 లక్షల వేతనంతో ఉద్యోగాలు

ఈనెల 20న జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు కర్నూలు జిల్లా ఉపాధి కల్పన అధికారి పి.దీప్తి తెలిపారు. రిలయన్స్ కన్స్యూమర్ ప్రాడక్ట్స్ లిమిటెడ్ కోసం మ్యానుఫ్యాక్చరింగ్ ఆపరేటర్ పోస్టులు భర్తీ చేయనున్నారని పేర్కొన్నారు. డిప్లొమా/ఐటీఐ అర్హతతో 24 ఏళ్ల వయస్సు గల అభ్యర్థులకు ప్రాధాన్యం ఉంటుందన్నారు. ఉద్యోగానికి ఎంపికైతే వార్షిక వేతనం రూ.3 లక్షలు ఉంటుందన్నారు. ఆసక్తి గలవారు www.ncs.gov.inలో నమోదు చేసుకోవాలన్నారు.
Similar News
News March 25, 2026
హుజూర్‌నగర్, కోదాడపై డీలిమిటేషన్ ఎఫెక్ట్!

రాబోయే డీలిమిటేషన్ ప్రక్రియతో హుజూర్‌నగర్, కోదాడ అసెంబ్లీ నియోజకవర్గాల సరిహద్దుల్లో కీలక మార్పులు జరిగే అవకాశం ఉందని పబ్లిక్ టాక్. ఈ ప్రాంతాల్లో పెరుగుతున్న జనాభా సాంద్రత, భౌగోళిక పరిస్థితుల ఆధారంగా కొన్ని మండలాలను ఇతర నియోజకవర్గాల్లో కలపడం లేదా కొత్తవి చేర్చడం జరిగే ఛాన్స్ ఉందని రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తోంది. పొరుగున ఉన్న నియోజకవర్గాల విభజన జరిగితే ఆ ప్రభావం నేరుగా HNR, KDDలపై పడనుంది.
News March 25, 2026
రాజధాని అమరావతిపై ఈ నెల 28న తీర్మానం

AP: ఈ నెల 28న అసెంబ్లీ ప్రత్యేక సమావేశం జరగనుంది. అమరావతిని రాష్ట్ర రాజధానిగా ప్రకటిస్తూ సభలో తీర్మానం చేయనున్నారు. అనంతరం తీర్మానాన్ని రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి పంపనుంది. ప్రస్తుతం జరుగుతున్న పార్లమెంట్ సమావేశాల్లోనే రాజధానిపై తుది నిర్ణయం తీసుకునే అవకాశముంది.
News March 25, 2026
HYD: ఇంధనంపై తప్పుడు ప్రచారం చేస్తే కఠినచర్యలు

HYDలో ఇంధన కొరత లేదని పోలీసులు స్పష్టం చేశారు. పెట్రోల్, డీజిల్, గ్యాస్ సరిపడా నిల్వలు ఉన్నాయని తెలిపారు. కొరత ఉందని తప్పుడు ప్రచారం చేస్తే కఠినచర్యలు ఉంటాయని హెచ్చరించారు. అక్రమ నిల్వలు చేసి కృత్రిమ కొరత సృష్టించిన వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని పేర్కొన్నారు. నిన్నటి నుంచి నగరంలో పెట్రోల్‌పై నెలకొన్న పుకార్లపై పోలీసులు సీరియస్ అయ్యారు.


