News November 19, 2025

నేటి నుంచి పత్తి కొనుగోళ్లు యథాతథం: మంత్రి

image

TG: <<18308868>>జిన్నింగ్<<>> మిల్లర్లతో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు జరిపిన చర్చలు సఫలమయ్యాయి. వారి సమస్యలపై కేంద్రానికి నివేదిక పంపిస్తామని మంత్రి హామీ ఇచ్చారు. నేటి నుంచి పత్తి కొనుగోళ్లను కొనసాగించాలన్నారు. మరోవైపు మొక్కజొన్న కొనుగోలు పరిమితిని ఎకరానికి 18 నుంచి 25 క్వింటాళ్లకు, సోయాబీన్ 6.72 నుంచి 10qlకు పెంచాలని అధికారులను ఆదేశించారు. ఆధార్ అథెంటికేషన్‌తో పాటు మొబైల్ OTP ఆధారంగా కొనుగోళ్లు జరపాలని సూచించారు.

Similar News

News March 10, 2026

యుద్ధం.. పడిపోతున్న బియ్యం ధరలు

image

మిడిల్ ఈస్ట్‌లో యుద్ధం వరి రైతులపైనా ప్రభావం చూపుతోంది. చెన్నై పోర్టు నుంచి ఆఫ్రికన్ దేశాలకు బియ్యం ఎగుమతులు ఆగిపోగా, ఇప్పటికే బయల్దేరిన కంటైనర్లూ వెనక్కి వచ్చేశాయి. దీంతో వారం కిందటి వరకు పుట్టి(850KG) ధాన్యం ధర ₹22,500 ఉండగా ప్రస్తుతం ₹21Kకు పడిపోయింది. ఇంకొన్ని రోజులు ఎక్స్‌పోర్ట్స్ నిలిచిపోతే రేట్లు మరింత పతనం కానున్నాయి. అలాగే $11.8Bn విలువైన ఆహారోత్పత్తుల ఎగుమతులపైనా ప్రభావం పడనుందని అంచనా.

News March 10, 2026

ఫైళ్ల దహనం వెనకున్న ప్లాన్ ఏంటో తేలాలి: సుప్రీంకోర్టు

image

AP: మదనపల్లి సబ్ కలెక్టర్ ఆఫీసులో జరిగిన ఫైళ్ల దహనం తీవ్రమైన నేరమని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. రికార్డు రూమ్‌లో మంటలు ఎలా అంటుకున్నాయి? దాని వెనకున్న ప్లాన్ ఏంటో లోతుగా విచారించాల్సి ఉందని తెలిపింది. ఈ కేసులో మాజీ మంత్రి పెద్దిరెడ్డి అనుచరుడు మాధవరెడ్డి సహా ఇతర నిందితుల ముందస్తు బెయిల్‌కు నిరాకరించింది. ఘటన సమయంలో నిందితుడు విదేశాల్లో ఉన్నారనే కారణంతో విచారణ నుంచి తప్పించుకోలేరని పేర్కొంది.

News March 10, 2026

ఈనెల 16 నుంచి వర్షాలు: వాతావరణ నిపుణులు

image

TG: రాష్ట్రంలో మరోసారి అకాల వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ నిపుణులు అంచనా వేస్తున్నారు. ఈ నెల 16 నుంచి 23 వరకు రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో ఉరుములతో కూడిన వడగళ్ల వర్షం పడే ఛాన్సుందని పేర్కొన్నారు. మరోవైపు రాష్ట్రంలో ఈ నెల 15 వరకు పొడి వాతావరణం ఉంటుందని HYD వాతావరణ కేంద్రం తెలిపింది. ప్రస్తుతం పగటి ఉష్ణోగ్రతలు 33-40 డిగ్రీలుగా నమోదవుతున్నాయి.