News April 13, 2024
ఉమ్మడి జిల్లాలో భారీ వర్షం నమోదు

ఉమ్మడి మెదక్ జిల్లా వ్యాప్తంగా రాత్రి భారీ వర్షం కురిసింది. గడచిన 24 గంటల్లో(ఉ. 8:30 గంటల వరకు) నమోదైన వర్షపాతం.. అత్యధికంగా కంగ్టిలో 68.8 మి.మీ., మనూర్ 41.8, ముక్తాపూర్ 39.3, పెద్ద శంకరంపేట 33.5, నాగల్ గిద్ద 28.8, రేగోడు 26.0, కోహిర్ 11.5, బోడగాట్, మునిపల్లి 11.0, సిర్గాపూర్ 9.8, అల్లాదుర్గం 8.0, మొగుడంపల్లి 7.8, లింగాయపల్లి 7.3, చికోడ్ 4.3 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైందని అధికారులు తెలిపారు.
Similar News
News March 26, 2026
మెదక్: ఆరోగ్యశ్రీ కింద 600 కోట్లకుపైగా బకాయిలు: మంత్రి

ప్రజా ప్రభుత్వం ఏర్పడే నాటికి ఆరోగ్యశ్రీ కింద రూ.600 కోట్లకు పైగా, ఈహెచ్‌ఎస్ కింద రూ.130 కోట్ల బకాయిలు ఉన్నాయని ఆరోగ్యశాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ తెలిపారు. అసెంబ్లీ క్వశ్చన్ హవర్‌లో మాట్లాడుతూ.. ప్రభుత్వం వచ్చిన నాటి నుంచి ఇప్పటివరకు 9.45 లక్షల మందికి ఉచిత వైద్యం అందించామని చెప్పారు. నెలకు సగటున రూ.89 కోట్లు చెల్లిస్తున్నామని, ఇప్పటివరకు రూ.2400 కోట్లకు పైగా విడుదల చేశామని తెలిపారు.
News March 26, 2026
MDK: డబ్బాలలో పెట్రోల్, డీజిల్ నిల్వ నిషేధం: ఎస్పీ

డబ్బాలు లేదా ప్లాస్టిక్ కంటైనర్లలో పెట్రోల్, డీజిల్ నిల్వ చేయడం పూర్తిగా నిషేధమని ఎస్పీ డీవీ. శ్రీనివాసరావు తెలిపారు. ఇలాంటి చర్యల వల్ల అగ్ని ప్రమాదాలు, పేలుళ్లు సంభవించే ప్రమాదం ఉందని హెచ్చరించారు. ప్రజలు ఇంధనాన్ని ఇళ్లలో నిల్వ చేయవద్దని సూచించారు. పెట్రోల్ బంక్ డీలర్లు నిషేధ బోర్డులు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. నిబంధనలు ఉల్లంఘిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.
News March 26, 2026
కౌడిపల్లి: ఫిట్స్‌తో పొలంలో రైతు మృతి

కౌడిపల్లి మండలం బుజరంపేట(పిర్యా) తండాలో విషాదం నెలకొంది. పొలంలో పనులు చేసుకుంటుండగా అకస్మాత్తుగా ఫిట్స్ రావడంతో రైతు సమ్యా నాయక్ మరణించినట్లు స్థానికులు తెలిపారు. బుధవారం సాయంత్రం ఫిట్స్ రావడంతో ఆయన అదుపు తప్పి పొలంలోని బురదలో పడిపోయారు. చుట్టుపక్కల ఎవరూ లేకపోవడంతో ముఖం బురదలో కూరుకుపోయి ఊపిరాడక అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. రైతు మృతితో తండాలో విషాద ఛాయలు అలముకున్నాయి.


