News November 17, 2025
రాష్ట్రపతికి 16వ ఆర్థిక సంఘం నివేదిక

రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ముకు 16వ ఆర్థిక సంఘం తన నివేదికను అందించింది. నికర పన్ను ఆదాయాన్ని కేంద్ర, రాష్ట్రాలు, స్థానిక సంస్థలకు మధ్య పంపిణీ వాటాలు, ఇతర అంశాలపై ఈ సంఘం సిఫార్సులు చేస్తుంటుంది. సంఘం సిఫార్సులను ఆర్థిక శాఖ పరిశీలించి బడ్జెట్లో ప్రవేశపెడుతుంది. 2026 ఏప్రిల్1 నుంచి 5 ఏళ్లపాటు ఈ సంఘం సిఫార్సులు అమలవుతాయి. కాగా 15వ ఆర్థిక సంఘం పన్ను ఆదాయంలో 41% STATESకు కేటాయించేలా సిఫార్సు చేసింది.
Similar News
News November 18, 2025
ఇవాళ్టి నుంచే అబుదాబి T10 లీగ్

ఇవాళ్టి నుంచి అబుదాబిలోని షేక్ జయేద్ స్టేడియం వేదికగా T10 లీగ్ ప్రారంభంకానుంది. 12 రోజులు జరగనున్న ఈ టోర్నీలో 8 టీమ్స్ 32 మ్యాచులు ఆడనున్నాయి. వెస్టిండీస్ స్టార్ హిట్టర్ నికోలస్ పూరన్ సారథ్యంలోని డెక్కన్ గ్లాడియేటర్స్ డిఫెండింగ్ ఛాంపియన్స్‌గా బరిలోకి దిగనుంది. టీమ్ ఇండియా మాజీ స్టార్స్ హర్భజన్ సింగ్, మురళీ విజయ్, పీయూష్ చావ్లా వంటివారు కూడా ఈ లీగ్‌లో భాగం కానున్నారు.

నవంబర్ 18: చరిత్రలో ఈరోజు

*1901: సినీ దర్శకుడు, నిర్మాత వి.శాంతారాం జననం
*1929: తెలుగు, తమిళ, మలయాళ చిత్రాల నటి బీఎస్ సరోజ జననం
*1962: భౌతిక శాస్త్రవేత్త, నోబెల్ బహుమతి గ్రహీత నీల్స్ బోర్ మరణం (ఫొటోలో)
*1963: పుష్ బటన్ టెలిఫోన్ సేవలు ప్రారంభం
*1984: నటి నయనతార జననం
*1994: కథా రచయిత పూసపాటి కృష్ణంరాజు మరణం