News April 13, 2024

నందిగంలో కారు బోల్తా 

image

నందిగం మండలం జాతీయ రహదారిపై శనివారం ఉదయం కార్ అదుపుతప్పి బోల్తా పడింది. పైడి భీమవరం నుంచి పలాస వెళ్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. పలాసలో జరుగు శుభకార్యానికి ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురు కారు బుక్ చేసుకుని వెళ్తున్నట్టు సమాచారం. ఈ ప్రమాదంలో కారులో ఉన్నవారికి స్వల్ప గాయాలతో బయటపడ్డారు. ఈ ఘటనపై నందిగం పోలీసులు వివరాలు సేకరిస్తున్నారు.

Similar News

News October 7, 2025

శ్రీకాకుళం: టుడే టాప్ న్యూస్

image

➲జిల్లాలో పర్యటించిన రాష్ట్ర ఆహార కమిషన్ ఛైర్మన్
➲SKLM: పీజీఆర్ఎస్‌కు 104 దరఖాస్తులు
➲వంశధార,నాగావళి నదులకు తప్పిన వరద ముప్పు
➲అధికారులతో పలాస ఎమ్మెల్యే శిరీష సమీక్ష
➲ఎచ్చెర్ల: జగనన్న కాలనీలో సదుపాయాలు ఏవీ?
➲టెక్కలి: 50వేలు గాజులతో లలితాత్రిపుర సుందరీ, రాజరాజేశ్వరి అమ్మవార్లకు అలంకరణ
➲ గోవా గవర్నర్‌ అశోక్ గజపతిని కలిసిన మంత్రి అచ్చెన్న
➲అరసవల్లి: ఆదిత్యుని ఆదాయం రూ.5.9 లక్షలు

News October 6, 2025

మెళియాపుట్టి: కరెంట్ షాక్‌తో 30 ఏళ్ల యువకుడి మృతి

image

ఇంటిపై చెట్టు కొమ్మలను తొలగిస్తుండగా కరెంటు షాక్‌తో ఓ యువకుడు సోమవారం మృతి చెందాడు. కుటుంబీకులు తెలిపిన వివరాల ప్రకారం.. మెళియాపుట్టి(M) గంగరాజపురం గ్రామానికి చెందిన చంటి(30) ఇంటిపై చెట్టు కొమ్మలను తొలగిస్తుండగా ప్రమాదవశాత్తూపై కప్పునకు ఉన్న కరెంట్ వైర్ తగిలి మరణించాడు. అక్క దమయంతి ఫిర్యాదుతో ఎస్ఐ రమేష్ బాబు కేసు నమోదు చేశారు. మృతదేహాన్ని పోస్టుమార్టానికి పాతపట్నం ఆసుపత్రికి తరలించారు.

News October 6, 2025

SKLM: ‘మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణాన్ని ఉపసంహరించుకోవాలి’

image

ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని దళిత-ఆదివాసీ-బహుజన-మైనార్టీ సంఘాల జేఏసీ నేతలు డిమాండ్ చేశారు. సోమవారం గ్రీవెన్స్ డే సందర్భంగా శ్రీకాకుళం జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్‌ను సంఘ నేతలు కలుసుకుని వినతిపత్రాన్ని అందజేశారు. ప్రభుత్వమే మెడికల్ కాలేజీలు నిర్వహించాలని అంతా కోరుకుంటున్నారని తెలియజేసారు.