News November 19, 2025

పుట్టపర్తిలో మోదీ ‘గో-గిఫ్ట్’.. 100 ఆవుల దానం

image

శ్రీ సత్యసాయి బాబా శత జయంతి ఉత్సవాల సందర్భంగా నేడు పుట్టపర్తికి రానున్న ప్రధాని నరేంద్ర మోదీ తన దాతృత్వాన్ని చాటనున్నారు. గుజరాత్‌కు చెందిన 100 జీఐఆర్ ఆవులను ప్రశాంతి నిలయానికి విరాళంగా అందజేయనున్నారు. వీటిని జిల్లా రైతులకు అందజేయనున్నట్లు తెలిసింది. రోజుకు 10 నుంచి 15 లీటర్ల పాలు ఇచ్చే ఈ ఆవులు రైతులకు ఆర్థికంగా తోడ్పాటునివ్వనున్నాయి.

Similar News

News March 21, 2026

దానం నాగేందర్‌పై హైకోర్టులో పిటిషన్

image

ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్‌పై తెలంగాణ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. దానం పార్టీ మారలేదని ఇటీవల స్పీకర్ గడ్డం ప్రసాద్ నిర్ణయం వెల్లడించడంతో బీజేపీ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి కోర్టును ఆశ్రయించారు. దానం బీఆర్ఎస్ నుంచి గెలిచి కాంగ్రెస్‌లో చేరారని, కాంగ్రెస్ సీటుపై ఎంపీగా పోటీ చేశారని పేర్కొన్నారు. పిటిషన్‌లో దానం పేరుతో పాటు స్పీకర్ పేరును కూడా చేర్చారు.

News March 21, 2026

ప్రకాశం: ‘రేపు కూడా కరెంట్ బిల్లులు చెల్లించవచ్చు’

image

ప్రకాశం జిల్లాలో ఆదివారం అయినా విద్యుత్ బిల్లు కౌంటర్లు తెరిచి ఉంటాయని SE కట్టా వెంకటేశ్వర్లు తెలిపారు. వినియోగదారుల సౌకర్యం కోసం ఈ నిర్ణయం తీసుకున్నారు. జిల్లాలోని అన్ని కౌంటర్లు పనిచేస్తాయని వెల్లడించారు. వినియోగదారులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరారు. నిర్ణీత సమయంలో బిల్లు చెల్లించడం వలన పెనాల్టీ పడదని అన్నారు.ఆన్‌లైన్‌లో కూడా బిల్లులు చెల్లించవచ్చని చెప్పారు.

News March 21, 2026

అంగారకుడిపై ఒకప్పుడు పుష్కలంగా నీళ్లు!

image

మానవులు జీవించడానికి అనుకూలమైన గ్రహాన్ని అన్వేషించడంలో కీలక పురోగతి లభించింది. అంగారకుడిపై ఒకప్పుడు నీరు పుష్కలంగా ప్రవహించిందనడానికి నాసా సైంటిస్టులు కొత్త ఆధారాలు కనుగొన్నారు. నాసా 2020లో ప్రయోగించిన Perseverance రోవర్ మార్స్‌లోని జెజెరో క్రేటర్‌లో 6.1KM ప్రయాణించి 35M లోతున భౌగోళిక నిర్మాణాలను విశ్లేషించింది. అక్కడ 3.7-4.2 బిలియన్ ఏళ్ల కిందట ఓ సరస్సు ఉండేదని నిర్ధారించింది.