News November 19, 2025
HYD: ప్లాస్టిక్ బాటిల్స్, పాత్రలు వాడుతున్నారా?

ప్రతిచోట ప్లాస్టిక్ కామన్ అయిపోయింది. మైక్రోప్లాస్టిక్స్‌తో మానవ శరీరంలో క్యాన్సర్స్, లీకీగట్, ఆహారాన్ని జీర్ణాశయం శోషించుకోలేకపోవడం వంటివి సైంటిస్టులు గుర్తించారు. HYDలో ప్రతి ఒక్కరి కడుపులోకి 0.8% మైక్రోప్లాస్టిక్ వెళ్తున్నట్లు ‘హెల్త్ మైక్రో ప్లాస్టిక్ కవరేజ్’ వెల్లడించింది. ప్లాస్టిక్‌కు వేడి తగిలితే నానోపార్టికల్స్ రిలీజ్ అవుతాయని, పింగాణీ, స్టీల్, ఇత్తడి, మట్టిపాత్రలు వాడాలని సూచించింది.
Similar News
News March 11, 2026
జిల్లా అభివృద్ధిపై సీఎం సమీక్షలో నెల్లూరు కలెక్టర్

అమరావతిలోని రాష్ట్ర సచివాలయం 5వ బ్లాక్‌లో CM చంద్రబాబు నిర్వహించిన 6వ కలెక్టర్ల కాన్ఫరెన్స్ మొదటి రోజు సమావేశంలో కలెక్టర్ హిమాన్షు శుక్లా పాల్గొన్నారు. జిల్లా అన్ని రంగాలలో అభివృద్ధి చేసే ప్రణాళికల పట్ల సమీక్షించారు. జిల్లాలో పరిశ్రమల స్థాపనకు అనువైన ప్రదేశాలు వంటి సమాచారాన్ని చర్చించారు.
News March 11, 2026
ఏలూరు జిల్లాలో వంట గ్యాస్‌పై జేసీ ఏమన్నారంటే!

ఏలూరు జిల్లావ్యాప్తంగా గృహ అవసరాలకు, ప్రభుత్వ వసతి గృహాలకు వినియోగించే వంట గ్యాస్ సిలిండర్ల సరఫరాలో ఎలాంటి కొరత లేదని జాయింట్ కలెక్టర్ అభిషేక్ గౌడ స్పష్టం చేశారు. కృత్రిమ కొరతపై వచ్చే వదంతులను నమ్మి ప్రజలు ఆందోళన చెందవద్దని కోరారు. బుకింగ్ లేదా సరఫరాలో ఏవైనా సమస్యలు ఎదురైతే వెంటనే సంబంధిత తహశీల్దార్ కార్యాలయంలో ఫిర్యాదు చేయాలని ఆయన సూచించారు.
News March 11, 2026
MGU డిగ్రీ సెమిస్టర్ పరీక్షల షెడ్యూల్ విడుదల

నల్గొండ: మహాత్మా గాంధీ విశ్వవిద్యాలయం పరిధిలో డిగ్రీ సెమిస్టర్ పరీక్షల షెడ్యూల్ యూనివర్సిటీ అధికారులు ప్రకటించారు. సెమిస్టర్- 2, 4, 6 (రెగ్యులర్ & బ్యాక్ లాగ్), సెమిస్టర్-1, 2, 3, 4, 5, 6 (బ్యాక్ లాగ్) పరీక్షలు ఏప్రిల్-7 నుంచి మే-2 మధ్య జరుగుతాయని కంట్రోల్ ఆఫ్ ఎగ్జామినేషన్ డా.ఉపేందర్ రెడ్డి తెలిపారు. R-16 & R-19 & R-25 బ్యాచ్ విద్యార్థులు గమనించాలని ఆయన తెలిపారు.


