News November 17, 2025
జనరల్ బాడీ సమావేశాలు ఏర్పాటు చేయాలి: వరంగల్ మేయర్

వరంగల్ పరిధిలో గల మహిళా సమైక్య సంఘాలు జనరల్ బాడీ సమావేశాలు ఏర్పాటు చేయాలని నగర మేయర్ గుండు సుధారాణి అన్నారు. సోమవారం బల్దియా ప్రధాన కార్యాలయంలో అమృత్ మిత్ర పథకంలో భాగంగా మెప్మా, హార్టికల్చర్ అధికారులతో ఏర్పాటు చేసిన సమావేశంలో మేయర్ పాల్గొని సమర్థవంతంగా చేపట్టేందుకు తగు సూచనలు చేశారు. అమృత్ మిత్ర పథకంలో భాగంగా మెప్మాతోపాటు హార్టికల్చర్ వారు సమన్వయం చేసుకుంటూ వెళ్లాలన్నారు.
Similar News
News November 18, 2025
బిహార్ కొత్త ఎమ్మెల్యేల్లో 40% మందికి డిగ్రీల్లేవ్

బిహార్‌లో కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేల్లో దాదాపు 40 శాతం మందికి డిగ్రీ కూడా లేదు. 32 శాతం మంది మాత్రమే గ్రాడ్యుయేట్లు ఉన్నారు. పీజీ చేసిన వాళ్లు 28 శాతం ఉన్నారు. 192 మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలు తిరిగి పోటీ చేయగా 111 మంది మళ్లీ గెలిచారు. ఇక 12 శాతం మంది మహిళలు (29) ఎన్నికయ్యారు. గతేడాదితో పోలిస్తే (26) కాస్త ఎక్కువ. ఈ విషయాలను PRS Legislative Research సంస్థ తాజాగా వెల్లడించింది.

ములుగు: హుర్రే..! పంచాయతీలకు సర్పంచులు వస్తున్నారహో..!

సుదీర్ఘ ఉత్కంఠ తర్వాత రాష్ట్ర ప్రభుత్వం సర్పంచ్ ఎన్నికల గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీంతో పల్లెల్లో మళ్లీ ఎన్నికల సందడి నెలకొననుంది. అనూహ్యంగా ఎన్నికలు ఆగిపోయిన స్థితిలో నెలకొన్న నైరాశ్యం దీంతో తొలగిపోనుంది. ములుగు జిల్లాలో మంగపేట(మం)లోని 25 జీపీలు మినహా మిగతా 146 జీపీలకు ఎన్నికలు జరగనున్నాయి. దాదాపు రెండేళ్లుగా సర్పంచులు లేక వెలవెలబోతున్న పంచాయతీలు ఇక నుంచి పూర్తి కార్యవర్గంతో కళకళలాడనున్నాయి.