News April 13, 2024
NLG: అసెంబ్లీ వారీగా నియోజకవర్గాల ఎన్నికల సన్నాహక సమావేశాలు

నల్గొండ లోక్ సభ నియోజకవర్గ పరిధిలోని అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా ఎన్నికల సన్నాహక సమావేశాలు ఈనెల 13 నుంచి 22 వరకు జరుగుతాయని నీటిపారుదల, పౌరసరఫరాలశాఖ మంత్రి నలమాద ఉత్తమ్ కుమార్ రెడ్డి శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. 13న దేవరకొండ, 16న మిర్యాలగూడ, 18న కోదాడ, 19న హుజూర్నగర్, 21న సూర్యాపేట, 22న నాగార్జునసాగర్ నియోజకవర్గాల సమావేశాలు సాయంత్రం 4 గంటలకు జరుగుతాయని తెలిపారు.
Similar News
News July 11, 2025
NLG: సంబురంగా మహిళాశక్తి సంబరాలు

జిల్లాలో మహిళా శక్తి సంబరాలు సంబురంగా జరుగుతున్నాయి. ఇప్పటికే గ్రామ మండల స్థాయిలో సమావేశాలు నిర్వహించారు. 12 నుంచి 18 వరకు నియోజకవర్గ స్థాయిల్లో కార్యక్రమాలను నిర్వహించనున్నారు. ఇందిరా మహిళాశక్తి క్యాంటీన్లు, సోలార్ పవర్ ప్లాంట్ల ఏర్పాటు, పెట్రోల్ పంపుల నిర్వహణ, చేపలు, పెరటి కోళ్ల పెంపకం, కిరాణా దుకాణాలు, టెంట్ హౌస్, పాల డెయిరీ ఏర్పాట్లను ప్రోత్సహిస్తూ మహిళల అభివృద్ధికి చర్యలు తీసుకుంటున్నారు.
News July 11, 2025
NLG: పంతుళ్ల పరేషాన్.. బడికి డుమ్మా ఇక కుదరిదిక!

సర్కారు బడులను గాడిలో పెట్టేందుకు పాఠశాల విద్యాశాఖ సరికొత్త అస్త్రాన్ని సంధిస్తోంది. ఇప్పటివరకు విద్యార్థులకు FRS విధానం ప్రవేశపెట్టిన ప్రభుత్వం, ప్రస్తుతం టీచర్లకు ఆ విధానాన్ని అమల్లోకి తెచ్చేందుకు సన్నద్ధమవుతుంది. పైలెట్ ప్రాజెక్టుగా ఎంచుకున్న పెద్దపల్లి జిల్లాలో FRS విధానం సత్ఫలితాలు ఇచ్చింది. ఈ నేపథ్యంలో త్వరలోనే ఉమ్మడి జిల్లాలో సైతం టీచర్ల ముఖ గుర్తింపు అటెండెన్స్ సిస్టం ప్రారంభం కాబోతుంది.
News July 11, 2025
NLG: న్యాయవాద వృత్తిలో శిక్షణకు దరఖాస్తుల ఆహ్వానం

జిల్లాలో లా కోర్సు చేసిన బీసీ విద్యార్థుల నుంచి న్యాయవాది వృత్తిలో మూడేళ్ల పాటు ఉచిత శిక్షణ పొందేందుకు 2025-26కు దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు కలెక్టర్ ఇలా త్రిపాఠి తెలిపారు. అభ్యర్థులు గుర్తింపు పొందిన కళాశాల నుంచి లా కోర్స్ పాసై ఉండాలన్నారు. జిల్లాలో నలుగురు అభ్యర్థులను ఎంపిక చేస్తామని తెలిపారు. ఈనెల 31 లోపు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.