News November 19, 2025
ఆన్‌లైన్‌లో అమ్మాయిలపై వేధింపుల్లో HYD ఫస్ట్!

నేషనల్ క్రైమ్ రిపోర్ట్ ప్రకారం ఆన్‌లైన్‌లో చిన్నారులు, మహిళలపై జరుగుతున్న వేధింపుల్లో దేశంలోనే HYD నం.1గా నిలిచింది. ఇతర మెట్రో నగరాలతో పోలిస్తే ఇలాంటి ఘటనలు హైదరాబాద్‌లో ఎక్కువగా నమోదయ్యాయి. ఆన్‌లైన్‌లో అసభ్య మెసేజ్‌లు పంపడం, మార్ఫింగ్ ఫొటోలు పంపించడం, అమ్మాయికి నచ్చకపోయినా వరుసగా మెసేజ్‌లు పంపుతూ ఇబ్బంది పెట్టడం వంటి వేధింపులు ప్రధానంగా కనిపిస్తున్నాయని నివేదికలో వెల్లడైంది.
Similar News
News March 15, 2026
మీ ఎంపీనే డ్రగ్స్ పార్టీలో దొరికిపోయారు: వైసీపీ

AP: రంగారెడ్డి జిల్లా మొయినాబాద్‌లోని ఓ ఫామ్‌హౌస్‌లో జరిగిన <<19386182>>డ్రగ్స్ పార్టీలో<<>> టీడీపీ ఎంపీ పుట్టా మహేశ్ కుమార్ యాదవ్ పట్టుబడ్డారని వైసీపీ ట్వీట్ చేసింది. టీడీపీ డ్రగ్స్ మాఫియా తెలుగు రాష్ట్రాల్లో యువత భవిష్యత్‌ను నాశనం చేస్తోందని మండిపడింది. ‘మీ ఎంపీనే డ్రగ్స్ పార్టీలో దొరికిపోయారు. ఇప్పుడు దీనికి ఏం సమాధానం చెప్తారు హోంమంత్రి’ అంటూ అనిత, చంద్రబాబు, పవన్, లోకేశ్‌ను ట్యాగ్ చేసింది.
News March 15, 2026
పటాన్‌చెరు: తల్లి, ముగ్గురు పిల్లలు MISSING

పటాన్‌చెరు పోలీస్ స్టేషన్ పరిధిలో తల్లి ముగ్గురు పిల్లలతో అదృశ్యమైన ఘటన కలకలం రేపింది. జహీరాబాద్‌కు చెందిన మహేందర్ రుద్రారం గీతం యూనివర్సిటీ సమీపంలో కూలీ పనులు చేస్తూ నివసిస్తున్నాడు. 12న భార్య కనకమ్మతో గొడవ జరిగింది. సాయంత్రం ఇంటికి వచ్చేసరికి కనకమ్మతో పాటు పిల్లలు సందీప్(8), హరీశ్(6), ఆకాశ్(4) కనిపించలేదు. శనివారం పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
News March 15, 2026
భూపాలపల్లి: రాయితీపై రైతులకు జిప్సం పంపిణీ

భూపాలపల్లి: జిల్లాలోని రైతులకు సబ్సిడీపై జిప్సం పంపిణీ చేయనున్నట్లు జిల్లా వ్యవసాయ అధికారి బాబురావు తెలిపారు. జిప్సం వాడకం వల్ల సౌడు భూముల స్వభావం మారి, నేలలో కాల్షియం, సల్ఫర్ పెరుగుతాయని పేర్కొన్నారు. రైతులు గ్రూపులుగా ఏర్పడి ఒక టన్నుకు కేవలం రూ. 566 చెల్లిస్తే, 90 శాతం రాయితీతో సరఫరా చేస్తామని వివరించారు. ఈ అవకాశాన్ని రైతులందరూ సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు.


