News April 13, 2024
గుంటూరు: 14వ రోజు జగన్ బస్సు యాత్ర ప్రారంభం

సీఎం జగన్ చేపట్టిన ‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్ర 14వ రోజు ప్రారంభమైంది. నంబూరు నుంచి ప్రారంభమైన యాత్ర.. ఇవాళ కాజ టోల్ గేట్, ఎన్ఆర్ఐ జంక్షన్ మీదుగా మంగళగిరిలోని సీకే ఫంక్షన్ హాల్‌కు చేరుకోనున్నారు. అక్కడ చేనేత కార్మికులతో జగన్ ముఖాముఖి నిర్వహించనున్నారు.
Similar News
News March 17, 2026
మంగళగిరి: దివ్యాంగులకు రేపటి నుంచి ఉచిత బస్సు ప్రయాణం!

రాష్ట్రంలోని 40 శాతం వికలాంగత్వం ఉన్న దివ్యాంగులకు ఉచిత బస్సు ప్రయాణ సదుపాయాన్ని ప్రభుత్వం అమలు చేయనుంది. ఈ పథకాన్ని ఈ నెల 18న సాయంత్రం 4 గంటలకు మంగళగిరి బస్టాండ్ వద్ద సీఎం చంద్రబాబు ప్రారంభించనున్నారు. తొలుత గుంటూరులో అనుకున్నా, కొన్ని కారణాల వల్ల వేదికను మంగళగిరికి మార్చారు. ఈ మేరకు ఏర్పాట్లను ఎస్పీ వకుల్ జిందాల్ స్వయంగా పర్యవేక్షించారు.
News March 17, 2026
మంగళగిరిలో ఏపీఈడీబీ నూతన కార్యాలయం ప్రారంభం

మంగళగిరిలో ఏపీ ఎకనామిక్ డెవలప్‌మెంట్ బోర్డు (ఏపీఈడీబీ) నూతన కార్యాలయాన్ని మంత్రి నారా లోకేశ్ లాంఛనంగా ప్రారంభించారు. అధికారులకు ఆయన కీలక దిశానిర్దేశం చేశారు. రాష్ట్రంలో 20 లక్షల ఉద్యోగాల కల్పనే మన ప్రధాన లక్ష్యంగా పనిచేయాలని ఆయన స్పష్టం చేశారు. కేవలం ఒప్పందాలకే పరిమితం కాకుండా, ఆ పెట్టుబడులు వాస్తవ రూపం దాల్చేలా అధికారులు గట్టి కృషి చేయాలని మంత్రి లోకేశ్ పిలుపునిచ్చారు.
News March 17, 2026
GNT-VJA ప్రయాణానికి కొత్త యూటర్న్ మార్గం

గుంటూరు నుంచి విజయవాడకు వెళ్లే వాహనాలకు కొత్త మార్గం అమల్లోకి రానుంది. బైపాస్‌ను ప్రధాన హైవేతో కలిపిన తర్వాత నేరుగా వెళ్లే అవకాశం ఉండదు. కాజా టోల్ దాటి మురుగన్ హోటల్ వద్ద సర్వీస్ రోడ్డులోకి మళ్లాలి. అక్కడి నుంచి కొంతదూరం వెళ్లి హైల్యాండ్ వద్ద యూటర్న్ తీసుకొని మళ్లీ హైవేలో చేరాలి. ఈ మార్గానికి సంబంధించిన రోడ్డు పనులు చివరి దశలో ఉన్నాయి. సూచిక బోర్డులు, భద్రతా ఏర్పాట్లు కూడా చేపడుతున్నారు.


