News November 17, 2025

అరకు: వణికిస్తున్న చలి పులి

image

ప్రముఖ పర్యటక కేంద్రమైన అరకులోయలో వారం రోజులుగా ఉష్ణోగ్రతలు కనిష్ట స్థాయికి పడిపోతున్నాయి. దీంతో చలి తీవ్రత పెరుగుతూ వస్తోంది. సాయంత్రం 4 గంటల నుంచే చలిగాలులు వీస్తున్నాయి. రాత్రివేళ చలి తీవ్రత పెరుగుతోంది. ఉదయం భానుడు ఉదయించినా పొగ మంచు తొలగిపోవడం లేదు. ప్రజలు చలి నుంచి రక్షణ కోసం స్వెటర్లు ధరిస్తూ చలిమంటలు వేసుకుని ఉపశమనం పొందుతున్నారు.

Similar News

News November 18, 2025

రికార్డు స్థాయిలో పసిడి దిగుమతులు

image

ధరలు పెరుగుతున్నా పసిడికి గిరాకీ తగ్గడంలేదు. రికార్డు స్థాయిలో దిగుమతులు జరుగుతున్నాయి. అక్టోబర్‌లో 14.72 బిలియన్ డాలర్ల బంగారం ఇంపోర్ట్ అయింది. గతేడాది అక్టోబర్‌తో పోలిస్తే దాదాపు 3 రెట్లు($4.92Bn) అధికం కావడం గమనార్హం. ఏప్రిల్-అక్టోబర్ మధ్య $41.23Bn దిగుమతులు నమోదయ్యాయి. గతేడాదితో పోలిస్తే ఇది 21.44%($34Bn) ఎక్కువ. స్విట్జర్లాండ్ నుంచి 40%, UAE నుంచి 16%, సౌతాఫ్రికా నుంచి 10% గోల్డ్ వస్తోంది.

ADB: పదో తరగతి పరీక్ష ఫీజు చెల్లింపు గడువు పెంపు: డీఈఓ

image

పదో తరగతి పరీక్షలకు హాజరయ్యే రెగ్యులర్, ఫెయిల్ విద్యార్థుల పరీక్ష రుసుమును చెల్లించేందుకు తేదీలను పొడిగిస్తున్నట్లు డీఈఓ రాజేశ్వర్ పేర్కొన్నారు. ఆదిలాబాద్ జిల్లాలోని అన్ని పాఠశాలల ప్రధానోపాధ్యాయులు ఆన్‌లైన్‌లో ఇంటర్ గేషన్ సైబర్ ట్రెజరీ ద్వారా ఫీజు చెల్లించాలని తెలిపారు. పరీక్ష రుసుముల వివరాల కోసం http://bse.telangana.gov.in వెబ్‌సైట్‌ను చూడాలని ఆయన సూచించారు.