News April 13, 2024

PU పరిధిలో ఎంఈడీ పరీక్ష రీషెడ్యూల్

image

పాలమూరు యూనివర్సిటీ పరిధిలో ఈనెల 16న జరగాల్సిన ఎంఈడీ పరీక్షను రీషెడ్యూల్ చేసినట్లు యూనివర్సిటీ అధికారులు తెలిపారు. మహనీయుల జయంతి నేపథ్యంలో 16న జరిగే ఎంఈడీ 3వ సెమిస్టర్ రెగ్యులర్, బ్యాక్ లాగ్ పరీక్షను ఈనెల 26వ తేదీకి వాయిదా వేసినట్లు అధికారులు తెలిపారు. ఈ పరీక్ష 26న మధ్యాహ్నం 2 గంటల నుంచి 5 వరకు ఉంటుందని విద్యార్థులు గమనించాలని కోరారు.

Similar News

News October 11, 2024

వనపర్తి: స్వీపర్‌ కూతురు టీచర్..!

image

వనపర్తి జిల్లా పాన్‌గల్ మండలం మాధవరావుపల్లి గ్రామానికి చెందిన మండ్ల వెంకటయ్య ప్రభుత్వ స్కూల్‌లో స్వీపర్‌గా పనిచేస్తున్నాడు. ఆయన కూతురు వనిత డీఎస్సీ ఫలితాలల్లో సెకండరీ గ్రేడ్ టీచర్ SGT జాబ్ సాధించింది. కాగా నాన్నకు తోడుగా స్వీపర్‌గా సాయం చేసేది. వనిత తల్లిదండ్రులు మాట్లాడుతూ.. చిన్నప్పటి నుంచే చదువులో ముందంజలో ఉంటూ ఉద్యోగాన్ని సాధించినట్లు తెలిపారు. ఉపాధ్యాయులు, గ్రామస్థులు ఆమెను అభినందించారు.

News October 11, 2024

ఉమ్మడి జిల్లాకు 7 ఇంటిగ్రేటెడ్ పాఠశాలలు మంజూరు

image

ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాకు రాష్ట్ర ప్రభుత్వం 7 ఇంటిగ్రేటెడ్ పాఠశాలలను మంజూరు చేసింది. అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన విద్యను అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఈ పాఠశాలలను ఏర్పాటు చేసేందుకు కృషి చేస్తుంది. జడ్చర్ల, దేవరకద్ర, కొల్లాపూర్, అచ్చంపేట, నాగర్ కర్నూల్, కొడంగల్, కొందుర్గు పట్టణాల్లో పాఠశాలలను ఏర్పాటు చేయనున్నారు. పలు చోట్ల నిర్మాణానికి పూజలు చేస్తున్నారు.

News October 11, 2024

అమెరికా ఐమాక్స్ ట్రేడ్ షోలో నల్లమల పర్యాటకం స్టాల్స్

image

కొల్లాపూర్: అమెరికా ఐమాక్స్ ట్రేడ్ షోలో తెలంగాణ పర్యాటక శాఖ ఏర్పాటు చేసిన పర్యటక స్టాల్స్‌ను పర్యాటకశాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు పరిశీలించారు. నల్లమల ప్రాంతంలోని పకృతి అందాలు, ఎత్తైన కొండల నుంచి జాలువారే జలపాతాల అందాలు, పర్యాటక ప్రదేశాలను, సోమశిల అమరగిరి కృష్ణానది పరివాహక పకృతి పర్యటకుల ఎంతగానో ఆకట్టుకుంటాయని, నల్లమలలో పర్యటించాలని అమెరికా పర్యాటకులను మంత్రి ఆహ్వానించారు.