News November 19, 2025
నేడే PM కిసాన్ 21వ విడత డబ్బుల జమ

PM కిసాన్ 21వ విడత నిధులు ఇవాళ విడుదల కానున్నాయి. రబీ పంట పెట్టుబడి సాయం కింద దేశ వ్యాప్తంగా 11 కోట్ల మంది రైతుల ఖాతాల్లో రూ.2 వేలు చొప్పున ప్రధాని మోదీ జమ చేయనున్నారు. 2019 FEB-24న PM కిసాన్ ప్రారంభించగా ఇప్పటి వరకు 20 విడతల్లో రూ.3.70 లక్షల కోట్లకు పైగా నిధులను అన్నదాతల అకౌంట్లలో జమ చేశారు. పీఎం కిసాన్ పోర్టల్‌లో నమోదై, బ్యాంకు ఖాతా ఆధార్‌తో లింక్ అయిన రైతులకే ఈ పథకం ప్రయోజనం అందనుంది.
Similar News
News April 4, 2026
భారత్‌కు మరో LPG ట్యాంకర్.. మొత్తం 8 నౌకలు

హార్ముజ్ జలసంధిని ఇరాన్ దాదాపు దిగ్బంధించినా భారత్‌కు మాత్రం ఊరట లభిస్తోంది. తాజాగా గ్రీన్ సాన్వీ అనే మరో LPG ట్యాంకర్ సేఫ్‌గా ఇండియాకు పయనమైంది. ఇప్పటి వరకు మన దేశానికి చెందిన 8నౌకలకు పర్మిషన్ లభించింది. మరే దేశానికి ఈ స్థాయిలో వెసులుబాటు లేకపోవడం మన దౌత్య విజయానికి నిదర్శనం. ‘మన ఉమ్మడి చరిత్రలో భారత్‌కు ఎప్పుడూ ప్రత్యేకమైన గౌరవం ఉంటుంది’ అని ముంబైలోని ఇరాన్ ఎంబసీ శుక్రవారం పేర్కొనడం విశేషం.
News April 4, 2026
ఆ సమయంలో బ్రాహ్మణి బాధపడింది: లోకేశ్

AP: CBNను YCP Govt అరెస్టు చేసి జైల్లో పెట్టినప్పుడు కర్ణాటకలోని తెలుగు ప్రజలూ తమకు అండగా నిలిచారని మంత్రి లోకేశ్ అక్కడి సింధనూర్‌లో పేర్కొన్నారు. ఆనాడు ఎంతో వ్యథ అనుభవించామన్నారు. ‘గౌరవంతో బతికిన కుటుంబం మనది. పెద్దాయన్ను అన్యాయంగా జైల్లో పెట్టారు. ఎందుకీ పరిస్థితి. ఇలాంటి రాజకీయాలు మనకు అవసరమా? అని బ్రాహ్మణి బాధపడింది’ అని తెలిపారు. ప్రజలు వెంటే ఉన్నారని, వారికి రుణపడి ఉండాలని చెప్పానన్నారు.
News April 4, 2026
విద్యార్థుల నుంచి ఫీజుల్ని వసూలు చేసుకోవచ్చు: హైకోర్టు

TG: ప్రభుత్వం రీయింబర్స్‌మెంటు నిధుల విడుదలలో విఫలమైతే ఇంజినీరింగ్ కాలేజీలు 2026-27లో విద్యార్థుల నుంచి నేరుగా ఫీజులు వసూలు చేసుకోవచ్చని హైకోర్టు సూచించింది. ప్రభుత్వం నిధులు విడుదల చేశాక తిరిగి విద్యార్థులకు ఆ ఫీజుల మొత్తాలను రిఫండ్ చేయాలని ఆదేశించింది. ఫీజు రీయింబర్స్‌మెంటు బకాయిలు విడుదల చేయకపోవడంపై కాలేజీలు దాఖలు చేసిన 14 పిటిషన్లను విచారించిన కోర్టు ఈ తీర్పు ఇచ్చింది.


