News November 19, 2025

నేడే PM కిసాన్ 21వ విడత డబ్బుల జమ

image

PM కిసాన్ 21వ విడత నిధులు ఇవాళ విడుదల కానున్నాయి. రబీ పంట పెట్టుబడి సాయం కింద దేశ వ్యాప్తంగా 11 కోట్ల మంది రైతుల ఖాతాల్లో రూ.2 వేలు చొప్పున ప్రధాని మోదీ జమ చేయనున్నారు. 2019 FEB-24న PM కిసాన్ ప్రారంభించగా ఇప్పటి వరకు 20 విడతల్లో రూ.3.70 లక్షల కోట్లకు పైగా నిధులను అన్నదాతల అకౌంట్లలో జమ చేశారు. పీఎం కిసాన్ పోర్టల్‌లో నమోదై, బ్యాంకు ఖాతా ఆధార్‌తో లింక్ అయిన రైతులకే ఈ పథకం ప్రయోజనం అందనుంది.

Similar News

News March 14, 2026

హాస్టళ్లలో కట్టెల పొయ్యిలపై వంట.. ఐటీ కారిడార్‌లో పొగ

image

TG: హైదరాబాద్‌లో కమర్షియల్ సిలిండర్ల కొరతతో చాలా వరకు హాస్టళ్లలో కట్టెల పొయ్యిపై వంటలు చేస్తున్నారు. దీంతో ఐటీ కారిడార్‌లో బిల్డింగుల మధ్య నుంచి పొగ వ్యాపిస్తున్న ఫొటో వైరల్‌గా మారింది. ఇప్పటికే చాలా పీజీలు, హాస్టళ్లలో టిఫిన్లు ఆపేశారు. తక్కువ గ్యాస్ వినియోగంతో పూర్తయ్యే వంటలే చేస్తున్నారు.

News March 14, 2026

ఒక్క రోజులో 1.34లక్షల ఇండక్షన్ స్టవ్స్ విక్రయం

image

దేశంలో గ్యాస్ సిలిండర్ల కొరత కారణంగా ప్రజలు ప్రత్యామ్నాయంగా ఇండక్షన్ స్టవ్స్‌ వైపు మొగ్గుచూపుతున్నారు. దీంతో వీటి విక్రయాలు రికార్డు స్థాయిలో జరుగుతున్నాయి. సాధారణంగా నెలకు 1.80 లక్షల అమ్మకాలు జరిగే చోట ఒక్క రోజే అమెజాన్‌లో 1.34 లక్షలకు పైగా స్టవ్‌లు అమ్ముడయ్యాయి. ఈ అనూహ్య డిమాండ్‌ను కంపెనీలు సైతం ఊహించకపోవడంతో చాలాచోట్ల ‘అవుట్ ఆఫ్ స్టాక్’ బోర్డులు పెట్టాల్సిన పరిస్థితి ఏర్పడింది.

News March 14, 2026

SIDBIలో స్పెషలిస్ట్ ఆఫీసర్ పోస్టులు

image

లఖ్‌నవూలోని స్మాల్ ఇండస్ట్రీస్ డెవలప్‌మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(SIDBI) 3 స్పెషలిస్ట్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. పోస్టును బట్టి డిగ్రీ, CA, CFA, MBA, PGDM అర్హతతో పాటు పని అనుభవం గలవారు మార్చి 18 వరకు ఈమెయిల్ ద్వారా అప్లై చేసుకోవాలి. షార్ట్ లిస్టింగ్, ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. వెబ్‌సైట్: https://www.sidbi.in