News November 19, 2025

నేడే PM కిసాన్ 21వ విడత డబ్బుల జమ

image

PM కిసాన్ 21వ విడత నిధులు ఇవాళ విడుదల కానున్నాయి. రబీ పంట పెట్టుబడి సాయం కింద దేశ వ్యాప్తంగా 11 కోట్ల మంది రైతుల ఖాతాల్లో రూ.2 వేలు చొప్పున ప్రధాని మోదీ జమ చేయనున్నారు. 2019 FEB-24న PM కిసాన్ ప్రారంభించగా ఇప్పటి వరకు 20 విడతల్లో రూ.3.70 లక్షల కోట్లకు పైగా నిధులను అన్నదాతల అకౌంట్లలో జమ చేశారు. పీఎం కిసాన్ పోర్టల్‌లో నమోదై, బ్యాంకు ఖాతా ఆధార్‌తో లింక్ అయిన రైతులకే ఈ పథకం ప్రయోజనం అందనుంది.

Similar News

News March 8, 2026

CA ఫలితాలు విడుదల

image

ఛార్టర్డ్ అకౌంటెన్సీ(CA) ఫలితాలను ICAI రిలీజ్ చేసింది. ఫౌండేషన్, ఇంటర్ పరీక్షల రిజల్ట్స్‌ను <>వెబ్‌సైట్‌<<>>లో ఉంచినట్లు తెలిపింది. అలాగే ఆలిండియా మెరిట్ లిస్టును అందుబాటులో ఉంచింది. జనవరి 18, 20, 22, 24 తేదీల్లో పరీక్షలు జరిగాయి. విద్యార్థులు తమ రిజిస్ట్రేషన్, రోల్ నంబర్లు ఎంటర్ చేసి ఫలితాలు చెక్ చేసుకోవచ్చు. ICAI ఏటా 3 సార్లు(జనవరి, మే/జూన్, సెప్టెంబర్) ఫౌండేషన్, ఇంటర్, ఫైనల్ పరీక్షలు నిర్వహిస్తుంది.

News March 8, 2026

ఈ వారం భారీగా తగ్గిన బంగారం, వెండి ధరలు

image

హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో ఈ వారం(మార్చి 2-8) బంగారం, వెండి ధరలు భారీగా తగ్గాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు రూ.6,870, తగ్గి రూ.1,63,640గా ఉంది. 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.6,300 పడిపోయి రూ.1,50,000 పలుకుతోంది. ఇక కేజీ సిల్వర్ ధర రూ.25వేలు తగ్గి రూ.2,90,000లకు చేరింది. మిడిల్ ఈస్ట్‌లో యుద్ధం వల్ల బంగారం, వెండి ధరలు పెరుగుతాయని భావించినా అనూహ్యంగా తగ్గడం గమనార్హం.

News March 8, 2026

మహిళా సమాఖ్యలకు సొంత భవనాలు.. ఆదేశాలు జారీ

image

TG: అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేళ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. ప్రతి గ్రామ పంచాయతీలో మహిళా సమాఖ్యలకు సొంత భవనాలను నిర్మించాలని నిర్ణయించింది. అధికారులు 200 గజాల స్థలాన్ని గుర్తించి నెలాఖరులోగా శంకుస్థాపన చేయాలని ఆదేశించింది. ఒక్కో భవనాన్ని ₹10L ఉపాధి హామీ నిధులతో నిర్మించాలని సూచించింది. సమావేశాలు, నైపుణ్య శిక్షణ కార్యక్రమాలకు ఇవి ఉపయోగపడనున్నాయి. కాగా డ్వాక్రా సంఘాల్లో 63L మంది సభ్యులున్నారు.