News November 19, 2025

ప్రజల అవసరాలకు అనుగుణంగా పనిచేయాలి: KMR SP

image

కామారెడ్డి ఎస్పీ రాజేష్ చంద్ర దేవునిపల్లి పోలీస్ స్టేషన్‌ను మంగళవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. రికార్డులు, రిసెప్షన్, లాక్-అప్ రూమ్ సహా అన్ని విభాగాలను పరిశీలించారు. సైబర్ క్రైమ్, ఆన్‌లైన్ మోసాలు, మూఢనమ్మకాలు వంటి అంశాలపై గ్రామాల్లో అవగాహన పెంచాలని సూచించారు. ప్రజా ఫిర్యాదుల్లో ఎలాంటి జాప్యం చేయకుండా తక్షణమే స్పందించాలని ఎస్పీ సూచించారు. ASP చైతన్య రెడ్డి, CI రామన్, SHO రంజిత్ పాల్గొన్నారు.

Similar News

News March 19, 2026

నాగర్‌కర్నూల్ జిల్లా DCC పూర్తిస్థాయి కార్యవర్గం

image

నాగర్‌కర్నూల్ జిల్లా కాంగ్రెస్ పార్టీ స్థాయి కార్యవర్గాన్ని TPCC అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ గురువారం ప్రకటించారు. జిల్లా అధ్యక్షుడిగా అచ్చంపేట ఎమ్మెల్యే డాక్టర్ వంశీకృష్ణతోపాటు ఉపాధ్యక్షుడిగా కట్ట అనంతరెడ్డి, హరి నారాయణ గౌడ్, వెంకటస్వామి, మాధవరెడ్డి, రాము యాదవ్, జగదీశ్వరుడు, ప్రధాన కార్యదర్శిలుగా బలరాం గౌడ్, కృష్ణారెడ్డి, రామనాథం, వెంకట్ రెడ్డి, నాగేశ్వరరావు, రామలింగం యాదవ్‌లను నియమించారు.

News March 19, 2026

BREAKING: ప్రభుత్వ విప్‌లుగా వేముల, అద్దంకి

image

ఉమ్మడి నల్గొండ జిల్లాకు చెందిన కీలక నేతలకు రాష్ట్ర ప్రభుత్వంలో సముచిత స్థానం దక్కింది. ప్రభుత్వ విప్‌లుగా శాసనసభలో నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం, శాసనమండలిలో ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్‌లను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. కీలకమైన పదవుల్లో రెండు జిల్లాకే దక్కడంతో కాంగ్రెస్ శ్రేణుల్లో ఉత్సాహం నెలకొంది. తమ నేతల నియామకంపై అనుచరులు, కార్యకర్తలు సంబరాలు జరుపుకుంటున్నారు.

News March 19, 2026

అరుదైన బ్లడ్ గ్రూప్.. 50 మందికి మాత్రమే!

image

మనందరిలో ప్రధానంగా నాలుగు గ్రూపుల రక్తం ఉంటుంది. కానీ ప్రపంచవ్యాప్తంగా 50 మందికి మాత్రమే ఉండే అత్యంత అరుదైన బ్లడ్ గ్రూప్ ‘Rh-Null’ అనే విషయం మీకు తెలుసా? దీనినే ‘గోల్డెన్ బ్లడ్’ అని పిలుస్తారు. ఇందులో ఏ రకమైన యాంటిజెన్లు ఉండవు, అందుకే ఈ రక్తం ఎవరికైనా సెట్ అవుతుంది. కానీ వీరికి రక్తం కావాలంటే మాత్రం దొరకడం చాలా కష్టం. ఇలాంటి ఇంట్రెస్టింగ్ విషయాలు ‘వంద రోజుల్లో-వంద వింతలు’లో