News April 13, 2024

ఫోన్ ట్యాపింగ్‌లో ఆ నలుగురే కీలకం?

image

TG: నలుగురు కీలక నేతల ఆదేశాలతో ఫోన్ ట్యాపింగ్ చేసినట్లు టాస్క్‌ఫోర్స్ మాజీ DCP రాధాకిషన్ రావు రిమాండ్ రిపోర్టులో తెలిసింది. గత అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ఓ టాస్క్‌ఫోర్స్ SI సహకారంతో డబ్బులు రవాణా చేసినట్లు పోలీసులు నిర్ధారించారు. ఎస్కార్ట్ వాహనంలో ఆ డబ్బులను డెలివరీ చేసినట్లు గుర్తించారు. తన చిన్ననాటి మిత్రుడైన ఓ MLCకి రాధాకిషన్ పూర్తిస్థాయిలో సాయం చేసినట్లు పోలీసులు నిర్ధారించారు.

Similar News

News March 20, 2026

గోదావరి నదిలో గల్లంతైన వారి వివరాలు ఇవే..!

image

ఎటపాక మండలం పురుషోత్తపట్నం వద్ద గోదావరి నదిలో <<19432323>>గల్లంతైన<<>> ఐదుగురు యువకులు అమరావతిలోని ఎస్ఆర్ఎం కాలేజీలో ఇంజినీరింగ్ విద్యార్థులుగా పోలీస్ అధికారులు చెప్తున్నారు. సతీశ్(మదనపల్లి), నవదీప్ (ఉయ్యూరు), తేజజ్ఞ(ఉయ్యూరు), శ్రీకర్(భద్రాచలం), అభిరామ్(విజయనగరం) అని తేల్చారు. వీరంతా బీటెక్ సెకండియర్ చదువుకుంటున్నారన్నారు. ఏడుగురు గోదావరిలోకి దిగగా ఇద్దరు సురక్షితంగా బయటపడ్డారన్నారు.

News March 20, 2026

గుడ్ న్యూస్: డెయిరీ, గొర్రెల ఫారాలకు ఛార్జీల రద్దు

image

AP: రాష్ట్రంలోని డెయిరీ, గొర్రెలు, మేకలు, పందుల పెంపకందారుల నుంచి వసూలు చేస్తున్న బెటర్‌మెంటు, డెవలప్మెంటు ఛార్జీలను ప్రభుత్వం రద్దు చేసింది. ఇక నుంచి వీటిని మినహాయిస్తున్నట్లు మున్సిపల్ శాఖ ఉత్తర్వులు జారీచేసింది. అలాగే వీటికి సంబంధించి మున్సిపాల్టీల పరిధిలోని బిల్డింగ్ పర్మిషన్, లైసెన్స్ ఫీజులను పంచాయతీలతో సమానం చేయనున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ఇచ్చిన హామీ మేరకు ఈ మినహాయింపులపై GO ఇచ్చారు.

News March 20, 2026

ఏప్రిల్ 1 నుంచి ఆ బ్యాంకుల ఏటీఎమ్ రూల్స్ ఛేంజ్!

image

ATM మనీ విత్‌డ్రాలపై HDFC, పంజాబ్ నేషనల్ బ్యాంక్ కోత విధించాయి. ఇప్పటివరకు సెపరేట్‌గా ఉన్న UPI విత్‌డ్రాల్స్‌ను రెగ్యూలర్ కార్డ్ విత్‌డ్రాల్‌తో HDFC కలిపేయనుంది. దీంతో ఫ్రీ లిమిట్ దాటితే ట్రాన్సాక్షన్‌కు ₹23 చొప్పున ఛార్జ్ పడుతుంది. ఇక PNB రూపే NCMC ప్లాటినమ్ డొమెస్టిక్ సహా పలు వేరియంట్లపై డైలీ విత్‌డ్రాల్ లిమిట్ ₹లక్ష నుంచి ₹50వేలుకు తగ్గించింది. ఏప్రిల్ 1 నుంచి ఈ మార్పులు అమలులోకి రానున్నాయి.