News November 19, 2025

MBNR: వాలీబాల్ ఎంపికలు.. విజేతలు వీరే!

image

ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా స్కూల్ గేమ్స్ ఫెడరేషన్(SGF) ఆధ్వర్యంలో బాల, బాలికలకు వాలీబాల్ ఎంపికలు నిర్వహించారు. మొత్తం 500 మంది క్రీడాకారులు పాల్గొనగా..
✒బాలికల విభాగంలో
1.బాలానగర్
2.మహమ్మదాబాద్
✒బాలుర విభాగంలో
1.నవాబ్ పేట
2. మహబూబ్ నగర్ జట్లు గెలిచినట్టు ఎస్జీఎఫ్ కార్యదర్శి డాక్టర్ ఆర్.శారదాబాయి ‘Way2News’తో తెలిపారు. ఎంపికైన వారికి ఉమ్మడి జిల్లా సెలక్షన్‌కు పంపిస్తామన్నారు.

Similar News

News March 18, 2026

కడప జిల్లాలో రైతుల నుంచి వసూళ్లు ఎంత..?

image

కడప జిల్లాలో రైతుల నుంచి MSPతో పంటల కొనుగోలు కోసం మార్క్ ఫెడ్ 21 ప్రొక్యూర్ మెంట్ కేంద్రాలను ఏర్పాటు చేసింది. ఇప్పటి వరకు 5,732 మంది శనగ రైతులు వీటిలో రిజిస్టర్ చేసుకున్నారు. వీరిలో 3,143 మంది రైతుల నుంచి 13,078.5 మెట్రిక్ టన్నుల శనగలు కొనుగోలు చేశారు. బస్తాకు రూ.150 – రూ.200లు మామూళ్లు వసూలు చేస్తున్నారని రైతులు ఆరోపిస్తున్నారు. ఈ లెక్కన రూ.3, 4 కోట్లు వసూలు చేశారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.

News March 18, 2026

పెద్దపల్లి జిల్లాలో వరి సాగుకు సమృద్ధిగా నీరు

image

పెద్దపల్లి జిల్లా వ్యాప్తంగా వరి సాగుకు రైతన్నలకు యాసంగి పంటకు నీటి కొరత లేకుండా ఉంది. గతేడాది కురిసిన వర్షాలతో చెరువులు, కుంటల్లో నీరు సమృద్ధిగా ఉండడంతోపాటు SRSP నీరు విడుదల చేశారు. దీంతో జిల్లా వ్యాప్తంగా 2.80 లక్షల ఎకరాల్లో రైతన్నలు వరి సాగు చేశారు. కాగా ఇందుకు సంబంధించి 4.50 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడి వచ్చే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు.

News March 18, 2026

నల్గొండ: రేషన్ ఇచ్చే గడువు పొడిగింపు

image

నల్గొండ జిల్లాలో రేషన్ కార్డు లబ్ధిదారులకు ఈనెల 19 వరకు రేషన్ తీసుకునే గడువును పొడిగించినట్లు పౌరసరఫరాల శాఖ ఎన్ ఫోర్స్‌మెంట్ డిప్యూటీ తహశీల్దార్ రఘునందన్ తెలిపారు. డీలర్లు షాపులను సమయానికి తెరిచి ఉంచాలని ఆదేశించారు. లబ్ధిదారులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని సూచించారు.