News November 19, 2025

కొత్తగూడెం: సివిల్స్ అభ్యర్థులకు రూ.లక్ష ప్రోత్సాహకం

image

రాజీవ్ గాంధీ సివిల్స్ అభయ హస్తం పథకం కింద సివిల్స్ ఇంటర్వ్యూలకు ఎంపికైన అర్హులైన అభ్యర్థులందరూ రూ.లక్ష ప్రోత్సాహకం కోసం దరఖాస్తు చేసుకోవాలని సింగరేణి సీఎండీ ఎన్.బలరాం నాయక్ తెలిపారు. గతంలో మెయిన్స్‌కు ఎంపికై రూ.లక్ష ప్రోత్సాహకం పొందిన అభ్యర్థులు మళ్లీ దరఖాస్తు చేయాల్సిన అవసరం లేదని ఆయన స్పష్టం చేశారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

Similar News

News March 18, 2026

GWL: బెట్టింగ్ యాప్స్ పై ప్రత్యేక నిఘా – ఎస్పీ శ్రీనివాసరావు

image

ఐపీఎల్ క్రికెట్ సీజన్ నేపథ్యంలో బెట్టింగ్ యాప్స్‌పై ప్రత్యేక నిఘా ఉంచినట్లు గద్వాల ఎస్పీ శ్రీనివాసరావు బుధవారం ప్రకటనలో పేర్కొన్నారు. ప్రస్తుతం పండుగల సందర్భంగా వివిధ కంపెనీల నుంచి వచ్చే డిస్కౌంట్ మెసేజ్‌లు క్లిక్ చేయవద్దన్నారు. అలాంటి మెసేజ్‌ల వల్ల సైబర్ దోపిడీ జరిగే ప్రమాదం ఉందన్నారు. జిల్లా ప్రజలు సైబర్ నేరాల బారిన పడకుండా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలిపారు.

News March 18, 2026

VZM: మామిడి రైతులకు ఉద్యాన శాఖ భరోసా

image

విజయనగరం జిల్లాలో మామిడి రైతులకు అండగా నిలుస్తూ పంట దిగుబడి పెంపునకు ఉద్యాన శాఖ చర్యలు చేపడుతోందని జిల్లా ఉద్యాన అధికారి కె.చిట్టిబాబు బుధవారం తెలిపారు. అకాల వర్షాలు, అధిక ఉష్ణోగ్రతల కారణంగా పంటపై పురుగులు, తెగుళ్లు పెరిగిన నేపథ్యంలో గ్రామ స్థాయిలో అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని చెప్పారు. రైతులు ఫ్రూట్ కవర్లు, జిగురు అట్టలు, పండు ఈగ నివారణ పద్ధతులు వినియోగించాలని సూచించారు.

News March 18, 2026

ప్రతి కుటుంబంలో వెలుగులు నిండాలి: కామారెడ్డి కలెక్టర్

image

ఉగాది ని పురస్కరించుకుని కామారెడ్డి జిల్లా ప్రజలందరికీ జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ శుభాకాంక్షలు తెలిపారు. ఉగాది పండుగ తెలుగు వారి సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతిబింబమని పేర్కొన్నారు. కొత్త ఆశలు, ఆశయాలతో ప్రారంభమయ్యే ఈ నూతన సంవత్సరం ప్రతి కుటుంబంలో వెలుగులు నింపాలని, అందరూ ఆయురారోగ్య ఐశ్వర్యాలతో వర్ధిల్లాలని కోరారు. కొత్త సంవత్సరంలో కామారెడ్డి జిల్లా మరింత ప్రగతి సాధించాలని ఆకాంక్షించారు.