News November 19, 2025
ఇతిహాసాలు క్విజ్ – 71

ఈరోజు ప్రశ్న: గణేశుడు మహాభారతాన్ని రాసేటప్పుడు తన దంతాన్ని ఎందుకు విరిచాడు?
☛ పై ప్రశ్నకు సమాధానాన్ని సాయంత్రం ఆరు గంటలకు పబ్లిష్ చేస్తాం.
☛ మీకు జవాబు తెలిస్తే కామెంట్ రూపంలో తెలియజేయండి.
<<-se>>#Ithihasaluquiz<<>>
Similar News
News March 16, 2026
ఆస్కార్ అవార్డులు అందేదెవరికో!

మరికాసేపట్లో 98వ ఆస్కార్ అవార్డుల ప్రదానోత్సవం ప్రారంభం కానుంది. ప్రపంచవ్యాప్తంగా ఎన్నో చిత్రాలు తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నాయి. సిన్నర్స్ మూవీ 16 నామినేషన్లతో టాప్‌లో ఉంది. లియోనార్డో డికాప్రియో నటించిన వన్ బ్యాటిల్ ఆఫ్టర్ అనదర్-13, సెంటిమెంటల్ వాల్యూ-9, ఫ్రాంకెన్‌స్టైన్-9, హామ్నెట్-8, ఎఫ్1-4 నామినేషన్లు సాధించాయి. తె.4.30 నుంచి హాట్‌స్టార్ OTTలో, స్టార్ మూవీస్ ఛానల్‌లో LIVE చూడొచ్చు.
News March 16, 2026
యానాం: ఉండేది ఏపీలో.. కానీ!

పుదుచ్చేరి(UT) అసెంబ్లీ <<19389988>>ఎన్నికలకు షెడ్యూల్<<>> వచ్చిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగా APలోని కాకినాడ దగ్గరున్న యానాం సీటుకూ ఎలక్షన్ జరగనుంది. ఇది భౌతికంగా APలో ఉన్నా పుదుచ్చేరి పాలనా పరిధిలో ఉండటమే ఇందుకు కారణం. 1954 వరకు ఫ్రెంచ్ పాలనలో యానాం ఉండింది. కానీ 1963లో అప్పటి ఒప్పందాల మేరకు UTగా పాండిచ్చేరి, కారైకల్, మాహేలతోపాటు విలీనమైంది. యానాం-పుదుచ్చేరి మధ్య సుమారు 780km దూరం ఉండటం గమనార్హం.
News March 16, 2026
మార్చి 16: చరిత్రలో ఈరోజు

*1764: తెలుగు భాష తొలి నిఘంటు కర్త మామిడి వెంకటార్యులు జననం
*1901: ప్రత్యేకాంధ్ర రాష్ట్రం కోసం ఆమరణ నిరాహార దీక్ష చేసిన పొట్టి శ్రీరాములు జననం
*1917 ఆంధ్రప్రదేశ్ మెుదటి లోకాయుక్త ఆవుల సాంబశివరావు జననం
*1963: భారత దేశ రెండో ప్రధాన న్యాయమూర్తి ఎం.పతంజలి శాస్త్రి మరణం
*జాతీయ టీకా దినోత్సవం


